ప్రస్తుతం ఇండస్ట్రీలో మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోల్లో గోపీచంద్ కూడా ఉన్నాడు. గత కొంత కాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్నాడు గోపీచంద్. చేయడానికి వరుసగా సినిమాలు చేస్తున్నా కూడా హిట్లు రావడం లేదు. ఇప్పుడు మరో సినిమాతో రాబోతున్నాడు గోపీచంద్. కన్నడ దర్శకుడు ఎ హర్షశ్రీ దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతుంది ఈసినిమా. రీసెంట్ గానే గోపీచంద్ పుట్టినరోజు సందర్బంగా ఈసినిమా టైటిల్ ను అలానే ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈసినిమాకు భీమా అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ తో బిజీగా ఉంది. ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా యాక్షన్ ప్యాక్డ్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. గతకొద్దిరోజులుగా చిత్రయూనిట్ కాకినాడ పరిసర ప్రాంతాలు అయిన రాజనగరం అద్దరిపేటలో షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఇన్నిరోజులు అక్కడ షూటింగ్ ను జరుపుకోగా తాజాగా ఈ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. కొత్త షెడ్యూల్ ను త్వరలో స్టార్ట్ చేయనుంది.
కాగా ఈ సినిమాను శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి స్వామి జే సినిమాటోగ్రాఫర్ కాగా, కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఇక సినిమాలో నటించే హీరోయిన్ ఇంకా ఇతర నటీనటుల వివరాలను త్వరలో తెలియచేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: