చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని అందుకుంది బేబి సినిమా. సాయి రాజేష్ దర్శకత్వంలో వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విని ప్రధాన పాత్రల్లో న్యూ ఏజ్ లవ్ స్టోరీ గా ఈసినిమా తెరకెక్కింది. ఇక ఈసినిమా ఈరోజుల్లో ప్రేమలు ఎలా ఉన్నాయో అద్దంపడుతూ తీసిన సినిమా కావడంతో యూత్ ను బాగా ఆకట్టుకుంటుంది. అందుకే మంచి ఆదరణను సొంతం చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా విమర్శకుల ప్రశంసల సైతం దక్కించుకుంది. అంతేకాదు సెలబ్రిటీలు సైతం ఈసినిమాపై స్పందిస్తున్నారు. ఇప్పటికే మాస్ మహారాజా రవితేజ, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈసినిమాపై స్పందించి ప్రశంసలు కురిపించారు. అంతేకాదు బన్నీ కూడా చిత్రయూనిట్ ను ప్రత్యేకంగా పిలిపించి అభినందించనున్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉండగా ఈసినిమా ఏ రేంజ్ లో కలెక్షన్స్ ను సొంతం చేసుకుంటుందో చూస్తూనే ఉన్నాం. ఈసినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. సినిమా రిలీజ్ అయి ఆరు రోజులు అవుతున్నా కూడా కలెక్షన్స్ మాత్రం ఎక్కడా తగ్గట్లేదు. మొదటి రోజే 7 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సొంతం చేసుకొని షాకిచ్చింది ఈసినిమా. ఇక మూడు రోజుల్లో 23 కోట్లను రాబట్టుకుంది. ఇప్పుడు ఆరు రోేజుల్లో ఈసినిమా ప్రపంచవ్యాప్తంగా దాదారు 44 కోట్లు కలెక్షన్స్ ను సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తుంది.
6 days & rains but ur love and affection on #Babythemovie is UNSTOPPABLE 🙏🙏🙏
Gratitude ❤️❤️❤️ pic.twitter.com/rhZBKxyaPI— SKN (Sreenivasa Kumar) (@SKNonline) July 20, 2023
కాగా ఈసినిమాను మాస్ మూవీ మేకర్స్‌పై ఎస్కేఎన్ నిర్మించారు. సినిమాకు విజయ్ బుల్ గానిన్ సంగీతం అందించారు. కాగా సినిమాటోగ్రాఫర్ గా బాల్ రెడ్డి, ఎడిటర్ గా విప్లవ్ నైషధం పనిచేశారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: