సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ కాంబినేషన్ గుంటూరు కారం అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. హిట్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై మొదటినుండీ ఆసక్తి నెలకొంది. అయితే ఈసారి మహేష్ లోని మాస్ యాంగిల్ ను బయటకు తీసుకురానున్నాడు త్రివిక్రమ్. దానికి రీసెంట్ గా రిలీజ్ చేసిన గ్లింప్సే ఉదాహరణగా చెప్పొచ్చు. మేకోవర్ ను మార్చేసి.. నోట్లో బీడీ పెట్టుకొని మహేష్ మాస్ లుక్ లో అదరగొట్టేశాడు. దీంతో మహేష్ ను ఇంత మాస్ లుక్ లో ఎప్పుడూ చూడకపోవడంతో అటు ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈసినిమాలో మీనాక్షి చౌదరి ఒక హీరోయిన్ గా నటిస్తున్నట్టు గత కొద్దికాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు అది కన్ఫామ్ అయిపోయింది. తాజాగా హత్య ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న మీనాక్షి చౌదరి గుంటూరు కారం సినిమా గురించి కూడా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియచేసింది. నేను ఎప్పుడూ సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి పెద్ద ఫ్యాన్ నే.. నా ఫస్ట్ షెడ్యూల్ ఇప్పటికే పూర్తయింది.. నా ఫస్ట్ డే ఫస్ట్ షాట్ మహేష్ గారితోనే జరిగింది.. మహేష్ గారు ఇంకా త్రివిక్రమ్ గారిది హిట్ పెయిర్.. వారి సినిమాలో చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.. చాలా ఎగ్జైయిటింగ్ గా ఉన్నా అంటూ తెలియచేసింది.
కాగా ఈసినిమాలో శ్రీలీల మరో హీరోయిన్ గా కనిపించనుంది. మధి కెమెరామెన్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా, థమన్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌పై ఎస్.రాధాకృష్ణ ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలకానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: