కృష్ణ అల్లుడిగా, మహేష్ బాబు బావగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు సుధీర్ బాబు. మొదట చిన్న పాత్రల్లో నటించిన సుధీర్ బాబు ఆ తర్వాత హీరోగా మారి ఇప్పటివరకూ కెరీర్ ను బాగానే కొనసాగిస్తున్నాడు. మొదటినుండీ సుధీర్ బాబు కూడా కాస్త డిఫరెంట్ సినిమాలే చేయడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తుండేవాడు. కొన్ని మంచి విజయం సాధించగా.. కొన్ని మాత్రం పరాజయాలే అందించాయి. అయినా కూడా సుధీర్ బాబు జయాపజయాలను పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే హంట్ సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో హరోం హర సినిమా కూడా ఒకటి. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా ఈసినిమా వస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ఎప్పుడో సెట్స్ పైకి వెళ్లింది. ప్రస్తుతం అయితే శరవేగంగా జరుపుకుంటుంది. ఇక తాజా సమాచారం ప్రకారం ఈసినిమా షూటింగ్ ప్రస్తుతం ఉడిపి పరిసర ప్రాంతాల్లో జరుపుకుంటుంది. ఇక ఈ షెడ్యూల్‌లో సుధీర్‌బాబుపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తుంది. మరోవైపు త్వరలోనే ఫస్ట్ లుక్‌ను విడుదల చేయడానికి చిత్రయూనిట్ ప్లాన్ చేస్తున్నట్టు కూడా సమాచారం.
కాగా కుప్పం నేపథ్యంలో డివైన్ టచ్ తో ఈసినిమా రానున్నట్టు అర్థమవుతుంది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుమంత్ జీ నాయుడు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అరవింద్ విశ్వనాథన్ సినిమా సినిమాటోగ్రఫీ.. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ గా విడుదల కానుంది..
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: