సర్కారు నౌకరి ఫస్ట్ లుక్ రిలీజ్

singer sunitha son akash debut movie sarkaru naukari first look out now

సినీ ఇండస్ట్రీలో వారసులు ఎంట్రీ ఇవ్వడం అనేది కామన్. అయితే వారి సక్సెస్ అనేది మాత్రం తమ టాలెంట్ పై, హార్డ్ వర్క్ పై ఆధారపడి ఉంటుంది. టాలెంట్ ఉంటే మాత్రం మన ప్రేక్షకులు తప్పకుండా ఆధారిస్తారు. ఇక ఇప్పుడు మరో వారసుడు టాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వచ్చేస్తున్నాడు. అతను ఎవరో కాదు టాలీవుడ్ టాప్ సింగర్ సునీత తనయుడు ఆకాష్ గోపరాజు. గంగనమోని శేఖర్ దర్శకత్వంలో ఆకాష్ హీరోగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇటీవలే ఈసినిమాను పూజా కార్యక్రమాలతో లాంచ్ చేసి షూటింగ్ కూడా పూర్తి చేస్తున్నారు. ఈ సినిమాకు సర్కారు నౌకరి అనే టైటిల్ ను కూడా అప్పుడే ఫిక్స్ చేసేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈసినిమా నుండి అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. పోస్టర్ లో ఆకాష్ లుక్ చూస్తుంటే ఈసినిమా ఇప్పటి కాలం నేపథ్యంలో తీస్తున్నట్టు అనిపించడంలేదు. పోస్టర్ అయితే ఆకట్టుకుంటుంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాకుండా ఆకాష్ డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్నాడన్న విషయం అర్థమవుతుంది.

కాగా ఈసినిమాను లెజెండరీ డైరెక్టర్ కే.రాఘవేంద్రరావు ఆర్.కె టెలీ షో ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఆకాశ్‌కు జోడీగా భావనా వళపండల్ నటిస్తోంది. ఈమెకు కూడా హీరోయిన్‌గా ఇదే తొలి సినిమా. ఇంకా ఈసినిమాలో తనికెళ్ల భరణి, సూర్య, సాయి శ్రీనివాస్ వడ్లమాని, మణిచందన, రాజేశ్వరి ముళ్లపూడి, రమ్య పొందూరి, త్రినాథ్ ఇతర పాత్రల్లో కనిపించనుననారు. శాండిల్య సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ కూడా గంగనమోని శేఖర్ పనిచేస్తుండటం విశేషం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × five =