పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలయికలో వస్తోన్న మోస్ట్ అవెటేడ్ మూవీ ‘బ్రో’. క్రేజీ కాంబోలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రముఖ తమిళ నటుడు, డైరెక్టర్ సముద్రఖని దీనికి దర్శకత్వం వహిస్తుండటం విశేషం. ఈ క్రమంలో తాజాగా ‘బ్రో’ సినిమా టీజర్ గురించి త్వరలోనే అప్డేట్ ఇస్తామని సముద్రఖని ట్వీట్ చేశారు. ఇక ఈ సందర్భంగా పెట్టిన ఓ పోస్టర్ పవర్ స్టార్ ఫ్యాన్స్‌ను ఖుషి చేస్తోంది. ఇందులో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ‘లుంగీ’ లుక్ లో కనిపించారు. అయితే ఈ లుక్ పవన్ సూపర్ హిట్ మూవీ ‘తమ్ముడు’ సినిమాను గుర్తు చేసింది. తమ్ముడు సినిమాలోని ‘వయ్యారి భామ.. నీ హంస నడక’ పాటలో కనిపించే లుంగీ లుక్ ని పోలి ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దీంతో ఈ స్టిల్ ‘బ్రో’ చిత్రంలో కూడా పాట నేపథ్యంలో వస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ‘బ్రో’ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ‘ఊర్వశి రౌతేలా’ ఓ స్పెషల్ సాంగ్ చేస్తోంది. ఈ పాటలో మామా అల్లుళ్లతో కలిసి ఆమె స్టెప్పులు వేస్తోంది. కాబట్టి ఇది ఆ సాంగులోని స్టిల్ అయ్యుంటుందని ఫ్యాన్స్ ఊహిస్తున్నారు. కాగా ఈ పోస్టర్ ప్రస్తుతం బాగా వైరల్ అవుతోంది. ఫ్యాన్స్ అయితే ‘తమ్ముడు’లో పవన్ ఎలా ఉన్నాడో.. ఇప్పుడూ అలాగే ఉన్నాడని అంటున్నారు. ఇక ఊర్వశి రౌతేలా ఇంతకుముందు ‘వాల్తేరు వీరయ్య’లో మెగాస్టార్ చిరంజీవితో కలిసి స్టెప్పులు వేసింది. టీజీ విశ్వప్రసాద్ నిర్మాతగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. జూలై 28న ‘బ్రో’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: