యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం గ్యారీ బీ హెచ్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగాా వస్తున్న సినిమా స్పై. స్వాతంత్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణం వెనుక ఉన్న మిస్టరీ నేపథ్యంలో ఈ సినిమా వస్తుండటంతో దేశ వ్యాప్తంగా ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. ఈసినిమాపై ఇప్పటికే అంచనాలు పెరిగిపోయాయి. దానికి తోడు రీసెంట్ గా ఈసినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేయగా అది యూ ట్యూబ్ లో ఏ రేంజ్ లో దూసుకుపోతుందో చూస్తున్నాం. ఇంట్రెస్టింగ్ గా కట్ చేసిన ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి. ఇప్పటికే కార్తికేయ2, 18 పేజేస్ తో రెండు హిట్లను అందుకున్న నిఖిల్ ఈసినిమాతో హ్యాట్రిక్ కొట్టడం ఖాయం అంటున్నారు. జూన్ 29వ తేదీన ఈసినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో.. ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ఈ మూవీ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఈసినిమాకు సెన్సార్ బృందం యూఏ సర్టిఫికెట్ అందించింది. అంతేకాదు సెన్సార్ బృందం ఈసినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ మూవీలో యాక్షన్ సీన్స్ బాగున్నాయని.. అలాగే ట్విస్ట్ లు కూడా ఆకట్టుకుంటాయని.. ఇక ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను మెప్పిస్తుందని సెన్సార్ బోర్డు సభ్యులు చెప్పినట్టు తెలుస్తోంది.
కాగా ఈసినిమాలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఆర్యన్ రాజేష్ కొంత గ్యాప్ తర్వాత ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా.. మనోజ్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నాడు. దర్శకత్వంతో పాటు గారీ ఈసినిమాకు ఎడిటర్ గా కూడా వ్యవహరించనున్నాడు. ఇంకా ఈసినిమాను తెలుగు, హిందీ, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషల్లో రూపొందించనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: