కీడా కోలా నుండి తరుణ్ భాస్కర్ క్యారెక్టర్ పోస్టర్ రిలీజ్

tarun bhaskar poster released from keedaa cola movie

పెళ్లి చూపులు, ఈనగరానికి ఏమైంది సినిమాల తరువాత చాలా గ్యాప్ తీసుకొని టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కీడా కోలా. కామెడీ ఎంటర్ టైనర్ గా ఈసినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. టీజర్ రిలీజ్ డేట్ కూడా ఇప్పటికే ప్రకటించారు. జూన్ 28వ తేదీన ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా నుండి వరుసగా పోస్టర్లను కూడా రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. రీసెంట్ గానే ఈసినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న బ్రహ్మానందం పాత్రకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈసినిమాాలో బ్రహ్మానందం వరదరాజులు అనే పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈసినిమాలో ఈసినిమాకు డైరెక్టర్ అయిన తరుణ్ భాస్కర్ కూడా నటిస్తున్నట్టు తెలుస్తుంది. తాజాగా తరుణ్ భాస్కర్ క్యారెక్టర్ ను రివీల్ చేశారు. నాయుడు అనే పాత్రలో తరుణ్ భాస్కర్ ఈసినిమాలో నటిస్తున్నాడు. చేతిలో గన్ నోట్లో సిగరెట్ తో సీరియస్ లుక్ లో ఉన్నాడు తరుణ్ భాస్కర్. బ్యాక్ గ్రౌండ్ లో ‘శ్వాస మీద ధ్యాస’ అనే క్యాప్షన్ ఆసక్తికంగా వుంది.

కాగా ఈసినిమాలో మొత్తంగా 8 ప్రధాన పాత్రలు ఈ సినిమాలో ఉంటాయని తెలుస్తోంది. విజి సైన్మా బ్యానర్ పై ప్రొడక్షన్ నంబర్ 1 గా తెరకెక్కబోతోన్న ఈసినిమాను భరత్ కుమార్, శ్రీపాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ, శ్రీనివాస్ కౌశిక్, సాయికృష్ణ గద్వాల్, విజయ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎజె ఆరోన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈసినిమాను ఈఏడాది రిలీజ్ చేయనున్నారు. రిలీజ్ డేట్ ను త్వరలోనే తెలియచేయనున్నారు మేకర్స్.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.