శ్రీ లీల బర్త్ డే- ఫస్ట్ లుక్ పోస్టర్ల సందడి

sreeleela first look posters revealed from her upcoming movies

ప్రస్తుతం టాలీవుడ్ లో ఫుల్ ఫామ్ లో ఉన్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే అది శ్రీలీల అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. పెద్ద హీరోలు, చిన్న హీరోలు అన్న తేడా లేకుండా అందరితో సినిమాలు చేసుకుంటూ ప్రస్తుతం కెరీర్ పీక్స్ లో ఉంది. రామ్ పోతినేని, సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో, పవన్ కళ్యాణ్ సినిమాలో, బాలకృష్ణ సినిమాలో ఇంకా విజయ్ దేవరకొండతో ఇలా వరుసపెట్టి సినిమాలు చేస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక నేడు శ్రీలీల పుట్టినరోజు. ఈ సందర్భంగా కొత్త సినిమాలకు సంబంధించిన పోస్టర్లు రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం నుండి ఫస్ట్ లుక్ వచ్చింది. ట్రెడిషనల్ లుక్ లో ఉన్న శ్రీలీల లుక్ ఆకట్టుకుంటుంది. ఇప్పుడు రామ్ పోతినేని హీరోగా వస్తున్న రాపో20 సినిమాకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈసినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి ఈసినిమాను కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కిస్తున్నారు.

నందమూరి బాలకృష్ణ హీరోగా డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం లో వస్తున్న ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ భగవంత్ కేసరి. ఈ చిత్రం లో కాజల్ అగర్వాల్ తో పాటుగా, యంగ్ బ్యూటీ శ్రీ లీల కీలక పాత్రలో నటిస్తుంది. నేడు శ్రీ లీల పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ బర్త్ డే విషెస్ తెలియజేస్తూ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.

ఇంకా పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా వస్తున్న ఆదికేశవ సినిమాలో శ్రీలీల హీరోగా నటిస్తుంది. నూతన దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో. ఇక ఈసినిమా నుండి కూడా శ్రీలీల పోస్టర్ ను రిలీజ్ చేశారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4సినిమాస్,శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

నితిన్ 32 లో కూడా శ్రీలీల నటిస్తున్న సంగతి తెలిసిందే. వక్కంతం వంశీ దర్శకత్వంలో ఈసినిమా రూపొందుతుంది. ఈసినిమా కూడా షూటింగ్ దశలో ఉంది. ఇక ఈసినిమా నుండి శ్రీలీల పుట్టినరోజు సందర్భంగా పోస్టర్ ను రిలీజ్ చేశారు. స్టైలిష్ లుక్ లో ఉన్న శ్రీలీల లుక్ బాగుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 − one =