రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. ఈసినిమా రిలీజ్ అయి ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో పలు భాషల్లో రిలీజ్ అవ్వగా.. మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈసినిమా పలు సంచలనాలు సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా కీర్తి గణించాడు. ఈసినిమా ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. జపాన్ కూడా ఈసినిమా రిలీజ్ అయి అక్కడ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఆర్ఆర్ఆర్ తరువాత ఎంతోమంది హాలీవుడ్ నటులు కానీ టెక్నీషియన్స్ కానీ ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో వర్క్ చేయాలన్న కోరికను బయటపెట్టిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు మరో హాలీవుడ్ నటుడు కూడా ఆర్ఆర్ఆర్ పై ప్రశంసలు కురిపిస్తూ రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో వర్క్ చేయాలన్న కోరికను బయటపెట్టాడు. ఆ హాలీవుడ్ నటుడు ఎవరో కాదు క్రిస్ హెమ్స్ వర్త్. తాజాగా ఈసినిమాను చూసిన క్రిస్ ఆర్ఆర్ఆర్ పై ఇంకా రాజమౌళి పై ప్రశంసలు కురిపించారు. అంతేకాదు చరణ్, ఎన్టీఆర్ తో వర్క్ చేయాలని ఉందని కూడా తెలిపాడు. మొత్తానికి ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్, చరణ్ కు హాలీవుడ్ లో కూడా మంచి గుర్తింపు దక్కింది. మరి ఫ్యూచర్ లో ఏదైనా ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ లో నటిస్తారేమో చూద్దాం.
ఈసినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో, అలానే రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించారు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటించగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటించింది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి, రాహుల్ రామకృష్ణ నటించారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం పై దానయ్య ఈ సినిమాని నిర్మించగా. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం.. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫి అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: