బాలకృష్ణ-అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా టైటిల్ ను కొద్దిసేపటి క్రితం మేకర్స్ రివీల్ చేశారు.ఈసినిమా కు భగవంత్ కేసరి అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.ఐ డోంట్ కేర్ ట్యాగ్ లైన్. ఈ సందర్భంగా బాలకృష్ణ మాస్ లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమా ప్రస్తుతం హైదరాబాద్ లో నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటుంది.కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీ లీల,ప్రియాంక జవాల్కర్ కీలకపాత్రల్లో కనిపించనున్నారు.అర్జున్ రామ్ పాల్ విలన్ రోల్ ను పోషిస్తున్నాడు.థమన్ సంగీతం అందిస్తుండగా షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి,హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు.ఈఏడాది దసరాకు ఈసినిమా విడుదలకానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా తరువాత బాలకృష్ణ మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.అందులో భాగంగా వాల్తేరు వీరయ్య ఫేమ్ డైరెక్టర్ బాబీతో సినిమా చేయడానికి బాలయ్య ఓకే చెప్పాడని టాక్.ఈనెల 10న బాలకృష్ణ తన బర్త్ డే జరుపుకోనున్నాడు.ఆ రోజు తన తదుపరి సినిమాలను ఆఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: