గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు సినిమా స్థాయి పెరుగుతూ వస్తోంది. మన చిత్రాలు దేశవ్యాప్తంగా అన్ని భాషల ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్‍లో తెలుగు సినిమాల హవా నడుస్తోంది. ‘బాహుబలి-1’, ‘బాహుబలి-2’, ‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ప’, ‘కార్తికేయ-2’ తదితర చిత్రాలు వందల కోట్ల వసూళ్లు సాధించి బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాయి. ఇదేకోవలో ఇప్పుడు తెలుగు సినిమా నటుల వంతు వచ్చింది. సాధారణంగా హిందీ నటీనటులను మనవారు దిగుమతి చేసుకుంటుంటారు. అయితే ఇటీవల టాలీవుడ్ నటులకు ఇతర భాషల చిత్రాల్లో అవకాశాలు లభిస్తున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
టాలీవుడ్ నటుడు అజయ్ తాజాగా అలాంటి అవకాశాన్నే దక్కించుకున్నారు. ఎన్నో తెలుగు సినిమాలలో తనదైన నటనతో ఆకట్టుకున్న ఆయనకు బాలీవుడ్ నుంచి ఆఫర్ వచ్చింది. స్టార్ హీరో నటిస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌లో అజయ్ నటించనున్నారు. బాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరైన అజయ్ దేవగన్ నటిస్తున్న ‘సింగం ఎగైన్’లో అజయ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. అజయ్ ఈ చిత్రంలో పోలీస్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సందర్భంగా తాజాగా ఆయన సింగం సెట్‌లో అజయ్ దేవ్‌గన్‌తో దిగిన ఫొటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక ఈ సినిమాకు రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తుండగా.. దీపికా పదుకొణే హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా ఇప్పటికే సింగం సిరీస్ నుంచి వచ్చిన రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు సింగం-3 తెరకెక్కబోతుంది. దీనిలో భాగంగా ఇప్పటికే మూవీ నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అర్జున్ కపూర్ విలన్‌గా నటిస్తున్న ఈ మూవీలో.. బాలీవుడ్ స్టార్ యాక్టర్స్ టైగర్ ష్రాఫ్, రణ్‌వీర్ సింగ్, కరీనా కపూర్, అక్షయ్ కుమార్ స్పెషల్ రోల్స్ లో కనిపించనున్నారు. అజయ్ దేవగన్-రోహిత్ శెట్టి కాంబో మరోసారి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందని బాలీవుడ్ జనాలు అంచనా వేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: