మచ్ అవైటెడ్ సీక్వెల్ సలార్ 2 షూటింగ్ ఆలస్యం గా స్టార్ట్ అయ్యేలా వుంది.నిజానికి ఈనెలలోనే ఈసినిమా ప్రారంభం కావాల్సివుంది కానీ ఇప్పుడు ఆఛాన్స్ కనిపించడడం లేదు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈసినిమా తో పాటు మైత్రి మూవీ మేకర్స్ తో మరో సినిమా కూడా కమిట్ అయ్యాడు.అదే ఎన్టీఆర్ 31. ఈ రోజు ఎన్టీఆర్ బర్త్ డే సందర్బంగా మేకర్స్ ఈసినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ కానుందో చెప్పేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆగస్టు నుండి ఎన్టీఆర్ 31 సెట్స్ మీదకు వెళ్లనుంది దాంతో సలార్ 2 షూటింగ్ ఆలస్యం కావడం తప్పకపోవచ్చు.మధ్యలో జూన్ ,జూలై మాత్రమే వుంది. ఈరెండు నెలల్లో సలార్ 2 షూటింగ్ పూర్తి చేయడం సాధ్యమవుతుందా పైగా ప్రభాస్ ప్రస్తుతం కల్కి 2898ఏడి తో బిజీ గా వున్నాడు. వచ్చే నెల ఈసినిమా విడుదలకానుండడంతో ప్రమోషన్స్ తో ఫుల్ బిజీ కానున్నాడు.
సో సలార్ 2 షూటింగ్ ఇప్పుడప్పుడే స్టార్ట్ అయ్యే ఛాన్స్ అయితే లేనట్లే. ప్రభాస్ కల్కి రిలీజ్ తరువాత రాజా సాబ్ ఫినిష్ చేయనున్నాడు.మారుతి డైరెక్ట్ చేస్తుండగా ఇప్పటివరకు సగం షూటింగ్ కంప్లీట్ అయ్యింది. సెప్టెంబర్ లోపు ఈసినిమాను పూర్తి చేయనున్నారు. ఆ తరువాత ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ తో స్పిరిట్ చేయాల్సి వుంది. ఈఏడాది చివర్లో స్టార్ట్ అవుతుందని సందీప్ రెడ్డి చెప్పేశాడు.ఈలెక్కన సలార్ 2 వచ్చే ఏడాది స్టార్ట్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.మరి సలార్ 2 విషయంలో మేకర్స్ త్వరలోనే ఓ క్లారిటీ ఇస్తారో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























