అఫీషియల్- వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎంగేజ్ మెంట్ డేట్ ఫిక్స్

varun tej and lavanya tripathi engagement date official announcement

మెగా ఫ్యామిలీలో ప్రస్తుతం పెళ్లి సందడి నెలకొంది. ఆ పెళ్లి మరెవరిదో కాదు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ది. మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌, హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్న విషయం తెలిసిందే. ఎప్పటినుండో వీరిద్దరి మధ్య ప్రేమాయణం సాగుతుందంటూ వార్తలు వచ్చినా ఆ వార్తలపై వరుణ్ తేజ్ కానీ, లావణ్య త్రిపాఠి కానీ బహిరంగంగా స్పందించింది లేదు. దీనిపై క్లారిటీ ఇచ్చింది లేదు. రీసెంట్ గా వీరిద్దరి ఎంగేజ్ మెంట్ పై కూడా వార్తలు వచ్చాయి. ఎంగేజ్ మెంట్ డేట్ ఫిక్స్ చేశారంటూ పలు కథనాలు వచ్చాయి. కానీ అధికారికంగా ప్రకటన రాకపోవడంతో దీనిలో కూడా నిజం లేదనుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే ఇప్పుడు తాాజాగా మెగా టీం సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చింది. అఫీషియల్ గా వీరిద్దరి ఎంగేజ్ మెంట్ డేట్ ను ప్రకటించారు. రేపు అంటే జూన్ 9 వ తేదీన వీరద్దరి నిశ్చితార్థ వేడుక ఘనంగా జరగనుంది. అంతేకాదు ఎంగేజ్ మెంట్ ఇన్విటేషన్ కార్డ్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వ‌రుణ్‌తేజ్‌, లావ‌ణ్య త్రిపాఠిలా ఎంగేజ్‌మెంట్ ఇన్విటేష‌న్ కార్డ్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. టూ హార్ట్స్ వ‌న్ ల‌వ్ అంటూ క్యాప్ష‌న్ ఉన్న ఈ కార్డులో వ‌రుణ్‌తేజ్ భుజంపై వాలిపోయి లావ‌ణ్య త్రిపాఠి క‌నిపిస్తోంది. హైద‌రాబాద్‌లో కుటుంబ‌స‌భ్యులు, స‌న్నిహితుల స‌మ‌క్షంలో ఎంగేజ్‌మెంట్ వేడుక వైభ‌వంగా జ‌రుగ‌నున్న‌ట్లు స‌మాచారం.

ఇక ఇక వ‌రుణ్‌తేజ్, లావ‌ణ్య త్రిపాఠి క‌లిసి మిస్ట‌ర్‌,అంత‌రిక్షం సినిమాల్లో క‌లిసి న‌టించారు. ఆ స‌మ‌యంలోనే వీరిద్ద‌రి మ‌ద్య ప్రేమ మొద‌లైన‌ట్లు స‌మాచారం. వరుణ్ తేజ్ ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో గాండీవధారి అర్జున అనే సినిమా చేస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈసినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని నాగబాబు సమర్పణలో శ్రీ వెంకటేశ్వరా సినీ చిత్ర బ్యానర్‌పై బీవిఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నాడు. ఈసినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తుండగా.. ముఖేష్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నారు. ఈసినిమా ఆగష్ట్ 25వ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. మరోవైపు లావణ్య త్రిపాఠి రీసెంట్ పులి మేక అనే వెబ్ సీరిస్ తో వచ్చింది. ఈ వెబ్ సీరిస్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తెలుగులో అయితే ప్రస్తుతానికి ఎలాంటి సినిమాలో నటించడంలేదు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + 9 =