టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ చాలాకాలం గ్యాప్ తర్వాత గతేడాది ‘భగవంత్ కేసరి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కోసం ఆమె తొలిసారిగా గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణతో జోడీకట్టింది. దసరా పండుగ సందర్భంగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఆ సినిమా సక్సెస్‌తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన కాజల్ ప్రస్తుతం ‘సత్యభామ’ అనే ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీలో నటిస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఇది కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోన్న 60వ సినిమా కావడం గమనార్హం. ఇందులో కాజల్‌తో పాటు విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్, ట్యాలెంటెడ్ యాక్టర్ నవీన్‌చంద్ర కీలక పాత్రలు పోషిస్తోన్నారు. మే 31న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా సత్యభామ ట్రైలర్ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ మేరకు సోమవారం సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. సత్యభామ చిత్రంలోని ముఖ్య పాత్రల పరిచయంతో పాటు ట్రైలర్ తేదీని వెల్లడించారు. దీనిప్రకారం మే 24వ తేదీన సత్యభామ ట్రైలర్ విడుదల కానుంది.
కాగా క్రైమ్ థ్రిల్లర్ కథాంశంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి సుమన్ చిక్కాల దర్శకత్వం వహిస్తుస్తున్నారు. ‘గూఢచారి’ ఫేమ్ శశికిరణ్ తిక్కా స్క్రీన్‌ప్లేతో పాటు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ డేరింగ్ అండ్ డాషింగ్ పోలీస్ ఆఫీసర్ సత్యభామగా కనిపించనుంది. ఇక కాజల్ ఇతర సినిమాల విషయానికొస్తే.. ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ‘ఇండియన్ 2’లో కమల్‌హాసన్ సరసన హీరోయిన్గా నటిస్తోంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























