అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో బ్లాక్ బస్టర్లను సొంతం చేసుకున్నాడు నటసింహాం బాలకృష్ణ. ఇప్పుడు హ్యాట్రిక్ కోసం ఎదురుచూస్తున్నారు బాలయ్య అభిమానులు. ప్రస్తుతం బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై మొదటినుండీ భారీ అంచనాలే ఉన్నాయి. అంతేకాదు అనిల్ రావిపూడి ఇంతవరకూ సక్సెస్ లే కొట్టాడు.. దీంతో ఈసినిమాతో బాలకృష్ణ కు హ్యాట్రిక్ పక్కా అన్న అభిప్రాయాలు కూడా వస్తున్నాయి. దానికి తగ్గట్టే అనిల్ కూడా బాలకృష్ణ కోసం సాలిడ్ కథను తయారుచేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. NBK 108 అనే వర్కింగ్ టైటిల్ తోనే షూటింగ్ ను జరుపుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక బాలయ్య ఫ్యాన్స్ ఎప్పటినుండో ఎదురుచూస్తుంది టైటిల్ కోసం. బాలకృష్ణ పుట్టినరోజు జూన్ 10 వ తేదీన టైటిల్ ను రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక టైటిల్ లాంచ్ ను కూడా చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. దీనిలో భాగంగానే ఈ సినిమా టైటిల్ లాంచ్ ను 108 హోర్డింగ్స్ తో లాంచ్ చేయనున్నారు. ఇక ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగాా తెలియచేసింది.
Let the celebrations kick off in a MASSIVE WAY😎#NBK108 Title Launch TOMORROW with 108 Hoardings across AP/TS 🔥
Stay Tuned💥#NandamuriBalakrishna @AnilRavipudi @MsKajalAggarwal @sreeleela14 @rampalarjun @MusicThaman @sahugarapati7 @harish_peddi @YoursSKrishna @Shine_Screens… pic.twitter.com/M9MU0U4eyV
— Telugu FilmNagar (@telugufilmnagar) June 7, 2023
కాగా ఈసినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. శ్రీలీల ఒక కీలక పాత్రలో నటిస్తుంది. ప్రియాంక జవాల్కర్ కూడా నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఈసినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. ఇక ఈసినిమాలో బాలకృష్ణ కుమార్తెగా శ్రీలీల అలరించనుందంట. ఈ చిత్రానికి కూడా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: