ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఏదైనా ఉంది అంటే అది ఆదిపురుష్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రామాయణం ఆధారంగా ఈసినిమా వస్తుండటమే ఈసినిమాపై ఇంత ఆసక్తి పెరగడానికి కారణం. ఇక ఆ అంచనాలను అంతకంతకూ పెంచేస్తూనే ఉంది చిత్రయూనిట్ కూడా. ట్రైలర్ తో ఒక్కసారిగా పెరిగిపోయిన ఎక్స్ పెక్టేషన్స్ పాటలతో మరో స్థాయికి తీసుకెళ్లారు. ఇక ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి ఘనంగా తిరుపతిలో జరిగిన సంగతి తెలిసిందే కదా. తెలుగు సినీ చరిత్రలో ఎన్నడూ జరగనంత ఘనంగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు ఈసినిమాలో టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ సంస్థ కూడా భాగమవుతుంది. ఆ సంస్థ మరేదో కాదు ఎన్నో సూపర్ హిట్లతో దూసుకుపోతున్న మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ. ఆది పురుష్ నైజాం హక్కులను మైత్రీ మూవీ మైకర్స్ సంస్థ సొంతం చేసుకుంది. తాజాగా ఈవిషయాన్ని చిత్రయూనిట్ సంస్థ అధికారికంగా తెలియచేసింది. భారీ స్థాయిలోనే డబ్బులు చెల్లించి ఈ హక్కులను సొంతం చేసుకున్నట్టు తెలుస్తుంది.
Get ready for the most Divine Experience, #Adipurush ❤️🔥
Proud to be releasing India’s Epic all across Nizam through the distribution wing of @MythriOfficial!
At your nearest cinemas from June 16th.#JaiShreeRam #Prabhas @kritisanon @omraut @TSeries @UV_Creations… pic.twitter.com/ExGubxBABD
— Mythri Movie Makers (@MythriOfficial) June 7, 2023
కాగా 3డీ విజువల్ ఎఫెక్ట్స్ తో మైథలాజికల్ సోషియో ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకోనున్న ఈసినిమాలో రాముని పాత్రలో ప్రభాస్ నటించగా.. సీతగా కృతి సనన్.. రావణుడిగా సైఫ్ అలీఖాన్ కనిపించబోతున్నారు. అలాగే లక్ష్మణుడి పాత్రలో బాలీవుడ్ యంగ్ హీరో సన్నీ సింగ్ నటిస్తున్నారు. ఈ సినిమాను టీ-సిరీస్, రెట్రో ఫైల్స్ సంస్థలపై బాలీవుడ్ నిర్మాతలు భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: