ఈమధ్య కాలంలో ఎక్కువమందికి రీచ్ అయినా సినిమా బలగం.కేవలం అర్బన్ ఏరియాల్లో కాదు రూరల్ ఏరియాల్లో కూడా ఈసినిమాకు విశేషమైన ఆదరణ లభించింది.చాలా ఊర్లలలో ఫ్రీగా ఏర్పాటు చేసిన స్పెషల్ స్క్రీనింగ్ లో సినిమాను వీక్షించారు.ఈఏడాది మార్చి లో విడుదలైన ఈసినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసింది.లో బడ్జెట్ లో తెరకెక్కిన బలగం సుమారు 25కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ మూవీస్ లో ఒకటి గా రికార్డు సృష్టించింది.ఇక ఇప్పుడు ఈసినిమా టీవీ లో ప్రసారం కానుంది.వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా స్టార్ మా లో ఈ ఆదివారం సాయంత్రం 6గంటలకు ప్రసారం కానుంది. టీవీలో కూడా ఈసినిమా ఖచ్చితంగా మంచి రేటింగ్స్ ను రాబట్టుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా కాసుల వర్షం కురిపించడమే కాదు ఎన్నో ప్రతిష్ఠాత్మక అవార్డులను కూడా ఖాతాలో వేసుకుంది.కమెడియన్ వేణు ఎల్దండి డైరెక్టర్ గా మారి ఈసినిమాను తెరకెక్కించాడు.తెలంగాణ సంప్రదాయాలను గుర్తుచేస్తూ కుటుంభ నేపథ్యంలో వచ్చిన ఈసినిమాలో ప్రియదర్శి,కావ్య కళ్యాణ్ రామ్ ,రచ్చ రవి,వేణు,సుధాకర్ రెడ్డి,మురళీధర్ గౌడ్ తదితరులు కీలకపాత్రల్లో నటించారు.భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించగా దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై హర్షిత్ రెడ్డి,హన్షితా రెడ్డి నిర్మించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: