తెలుగు, తమిళ చిత్రాల్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసి తిరుగులేని స్థానాన్ని దక్కించుకున్న విలక్షణ నటుడు చియాన్ విక్రమ్. తన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యత ఉండేలా చూసుకుంటాడు. ఇక రీసెంట్ గానే పొన్నియన్ 2 సెల్వన్ సినిమాతో బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్నాడు. మణిరత్నం దర్శకత్వంలో రెండు పార్ట్ లుగా వచ్చిన ఈసినిమా మొదటి పార్ట్ గత ఏడాది రిలీజ్ అవ్వగా రెండో పార్ట్ గత నెల ఏప్రిల్ 28వ తేదీన రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం చియాన్ విక్రమ్ తంగలాన్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈసినిమా షూటింగ్ కూడా కొంత వరకూ పూర్తయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇన్ని రోజులు పొన్నియన్ సెల్వన్ 2 సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న విక్రమ్ మళ్లీ తంగలాన్ షూటింగ్ లోపాల్గొన్నాడు. ఇక రిహార్సల్ చేస్తున్న సమయంలో విక్రమ్ రిబ్స్ కు గాయాలయ్యాయి. దీంతో వైద్యులు సర్జరీ అవసరమని చెప్పినట్లు సమాచారం. పెద్ద గాయమే అవడంతో కోలుకునేందుకు సమయం కూడా పడుతుంది. దీంతో తంగలాన్ చిత్రం షూటింగ్‌కు బ్రేక్ పడింది.
కాగా పా రంజిత్ దర్శకత్వంలో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌లోని గనుల్లో పనిచేసే కార్మికుల జీవితం ఆధారంగా ఈసినిమా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. పార్వతి తిరువొత్తు, డేనియల్ కాల్టాగిరోన్, మాళవిక మోహనన్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్టూడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: