స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ఎన్టీఆర్ 30 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా ఇటీవలే గ్రాండ్ గా లాంచ్ అయింది. ప్రస్తుతం చిత్రయూనిట్ షూటింగ్ ఏర్పాట్లలో ఉంది. మరి ఈసినిమా ను భారీ స్థాయిలో తెరెక్కిస్తున్నారు కాబట్టి ఆ రేంజ్ లోనే టెక్నీషియన్స్ ను కూడా తీసుకుంటున్నారు. ఈనేపథ్యంలోనే ఈసినిమా కోసం వరుసగా హాలీవుడ్ టెక్నీషియన్స్ ను రంగంలోకి దించుతున్నారు మేకర్స్. ఇప్పటికే ఈసినిమా కోసం హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ ను తీసుకున్నారు. ఇక ఇప్పుడు మరో హాలీవుడ్ టెక్నీషియన్ ను తీసుకొచ్చారు. ఈ సినిమా విఎఫ్ఎక్స్ కోసం ఎన్నో హాలీవుడ్ సినిమాలకి వర్క్ చేసిన బ్రాడ్ మిన్నిచ్ తీసుకున్నారు. ఇక ఈవిషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
#BradMinnich will be the VFX supervisor for crucial sequences in #NTR30 💥💥
Get ready for a stunning visual treat on the Big Screens 🤩#NTR30Begins@tarak9999 #JanhviKapoor #KoratalaSiva @NANDAMURIKALYAN @anirudhofficial @NTRArtsOfficial pic.twitter.com/UZFuUcW2V4
— Yuvasudha Arts (@YuvasudhaArts) March 28, 2023
కాగా ఈసినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. యువసుధ ఆర్ట్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీకర ప్రసాద్ ఎడిటర్ గా సబు సిరిల్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నారు. ఇంకా ఈసినిమాలో నటించే ఇతర నటీనటులకు సంబంధించిన వివరాలు త్వరలోనే తెలియచేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: