బలగం మూవీ డైరెక్టర్‌ వేణుకు మంత్రి కేటీఆర్‌ అభినందనలు

Minister KTR Congratulated Balagam Movie Director Yeldandi Venu

దిల్‌రాజు ప్రొడక్షన్స్‌ శిరీష్‌ సమర్పణలో హర్షిత్‌ రెడ్డి, హన్షిత నిర్మాతలుగా వేణు ఎల్దండి దర్శకత్వంలో ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్‌ రామ్‌ జంటగా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యంలో తెరకెక్కిన బలగం మూవీ మార్చి 3 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించించి. ఈ మూవీలో నటించిన నటీనటులు అందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. లో బడ్జెట్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ.. భారీ కలెక్షన్స్ రాబడుతూ విజయవంతంగా ప్రదర్శించబడుతుంది.కోటిన్న‌ర ప్రీ రిలీజ్ బిజినెస్ టార్గెట్‌తో రిలీజైన బ‌ల‌గం సినిమా అద్భుత కలెక్షన్స్ తో నిర్మాతలకు భారీ లాభాలు అందించింది. తెలంగాణ నేప‌థ్య క‌థాంశంతో రూపొందిన సినిమా కావ‌డంతో నైజాం ఏరియాలోనే బ‌ల‌గం సినిమా భారీ వసూళ్లను సాధిస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఉగాది నంది సత్కారం అందుకున్న బలగం మూవీ ఓటీటీ లో కూడా అద్భుత రెస్పాన్స్ తో దూసుకుపోతోంది. బలగం సినిమా డైరెక్టర్‌ యెల్దండి వేణును మంత్రి కేటీఆర్‌ అభినందించారు. తాను బలగం సినిమా చూశాననీ , అద్భుతంగా తీసినట్లు ఆయనను ప్రశంసలతో ముంచెత్తారు.కలెక్టరేట్‌లో జరిగిన ఉత్తమ పంచాయతీలకు అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమం అనంతరం, అక్కడికి వేణును కేటీఆర్‌ ఆహ్వానించి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ .. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, అనుబంధాలను చక్కగా చూపించారనీ , తక్కువ బడ్జెట్‌తో సమాజానికి దోహదపడేలా బలగం లాంటి సినిమాలు తీయాలనీ , మంచి సినిమాలను ప్రజలు ఎప్పుడూ ఆదరిస్తారనీ , దీనికి ఉదాహరణ బలగం సినిమానే అనీ , తాను గ్రాండ్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు హాజరైన సినిమా భారీ విజయం కావడం సంతోషంగా ఉందనీ , తన నియోజవర్గానికి చెందిన వేణు సిరిసిల్ల ఖ్యాతిని బలగం సినిమాతో పెంచారనీ , మంచి సినిమాలకు తన సపోర్ట్‌ ఎప్పుడూ ఉంటుందనీ , వేణు భవిష్యత్తులో మంచి స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నా ననీ చెప్పారు. కమర్షియల్‌ సినిమాల వైపు ఇప్పుడే వెళ్లొద్దని వేణుకు సూచించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌కు డైరెక్టర్‌ వేణు కృతజ్ఞతలు తెలిపారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − 4 =