టాలీవుడ్ స్టార్ హీరోలతో నటించాలని ఉంది – ఫరియా అబ్దుల్లా

Actress Faria Abdullah Says She Wants To Act With Tollywood Top Heros

క్లాసికల్ డ్యాన్సర్ , థియేటర్ ఆర్టిస్ట్ , మోడల్ ఫరియా అబ్దుల్లా బ్లాక్ బస్టర్ జాతిరత్నాలు మూవీ తోం కథానాయికగా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఆ మూవ్ చిట్టి పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ఫరియా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సూపర్ హిట్ బంగార్రాజు , మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మూవీస్ లో అతిథి పాత్రలలో నటించి ఫరియా ప్రేక్షకులను అలరించారు. అభిషేక్ పిక్చర్స్, రవితేజ టీమ్ వర్క్స్ బ్యానర్లపై సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన రావణాసుర మూవీ ఏప్రిల్ 7 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ సినిమాలోని ఐదుగురు కథానాయికలలో ఫరియా ఒకరు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజా ఇంటర్వ్యూలో ఫరియా మాట్లాడుతూ .. రవితేజగారి కాంబినేషన్లో తన సీన్స్ చాలా ఉన్నాయనీ , ఆయన కామెడీ టైమింగును .. ఎనర్జీని అందుకోవటం చాలా కష్టం అనీ , .బాగా ప్రిపేర్ అయిన తరువాతనే తాను కెమెరా ముందుకు వెళ్లేదానిననీ , షూటింగు గ్యాప్ లో మాత్రం అయన చాలా సరదాగా ఉంటారనీ , రావణాసురమూవీ తరువాత తాను బిజీ అవుతానని అనుకుంటున్నాననీ , టాలీవుడ్ స్టార్ హీరోలు ప్రభాస్ .. మహేశ్ బాబు … ఎన్టీఆర్ .. చరణ్ .. బన్నీ.. విజయ్ దేవరకొండలతో కలిసి నటించాలని ఉందనీ , అలాంటి ఒక అవకాశం కోసం వెయిట్ చేస్తున్నాననీ చెప్పారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − five =