టాలీవుడ్ స్టార్ రైటర్ గోపీ మోహన్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు ఆయన రైటర్ గా పని చేశారు. ముఖ్యంగా కోనవెంకట్ తో కలిసి ఎన్నో హిట్ సినిమాలకు మాటలు, సన్నివేశాలు అందించిన రచయిత గోపీ మోహన్. మంచు విష్ణు నటించిన ఢీ, దేనికైనా రెడీ, అక్కినేని నాగార్జున నటించిన కింగ్, సంతోషం..విక్టరీ వెంకటేష్ నటించిన నమో వెంకటేశ, రామ్ నటించిన రెడీ ఇలా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు ఈయన రైటర్ గా పనిచేశారు. అంతేకాదు అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా యమజాతకుడు, వంశీ, నువ్వు నేను వంటి సినిమాలకు పనిచేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక నేడు ఆయన గుడ్ న్యూస్ ను పంచుకున్నారు. ఆయన సతీమణి ప్రవీణ నేడు పండంటి మగబిడ్డకు జన్మనివ్వడంతో తండ్రి అయ్యారు. ఈవిషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియచేస్తూ ఆనందాన్ని వ్యక్తంచేశారు. బాబుని ఎత్తుకుని గోపి మోహన్ ఆనందంతో మురిసిపోతున్న ఫోటోని షేర్ చేశాడు. దీంతో టాలీవుడ్ సినీ ప్రముఖులు అలాగే నెటిజన్లు.. ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: