ఎన్టీఆర్ అదుర్స్ మూవీ రీ రిలీజ్ డేట్

అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై వివి వినాయక్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ కామెడీ అదుర్స్ మూవీ 2010 జనవరి 13 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ మూవీలో నయనతార, షీలా కథానాయికలు. బ్రహ్మానందం ఒక కీలక పాత్రలో నటించగా మహేష్ మంజ్రేకర్, నాజర్, రమాప్రభ ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ లో ఎన్టీఆర్ నరసింహ, చారి గా ద్విపాత్రాభినయం చేసి ప్రేక్షకులను అలరించారు. ఎన్టీఆర్, బ్రహ్మానందంల కామెడీ ట్రాక్ ఈ మూవీకి హైలైట్ గా నిలిచింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అదుర్స్ మూవీని ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించి దర్శకుడు వినాయక్ ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరకల్పన లో సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సూప‌ర్ హిట్ ఫిల్మ్ అదుర్స్ 13 ఏళ్ల త‌ర్వాత మ‌రోసారి ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. అదుర్స్ మూవీ మార్చి4 వ తేదీ రీ రిలీజ్ కానుంది. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న #NTR30 మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.