గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటసింహం బాలకృష్ణ హీరోగా వస్తున్న సినిమా వీరసింహారెడ్డి. మాస్ ఎంటర్ టైనర్ గా ఈసినిమాను తెరకెక్కించారు. సంక్రాంతి కానుకగా ఈసినిమా జనవరి 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఈనేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కూడా వేదికను ఖరారు చేశారు. ఈ నెల 6వ తేదీన ఒంగోలు లోని ఏబీఎమ్ కాలేజీ గ్రౌండ్స్ లో సాయంత్రం 6 గంటల నుండి ఈ కార్యక్రమం నిర్వహించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
వీరసింహా రెడ్డి సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే కదా. గతంలో బాలయ్య సినిమాకు కూడా థమనే సంగీతం అందించాడు.. ఆ సినిమాకు సంగీతం ఎంత హైలెట్ అయిందో చూశాం. ఇక థమన్ ఈసినిమాకు కూడా ఎలాంటి పాటలు అందించాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈసినిమాలోని పాటలకు వస్తున్న రెస్పాన్స్ ను చూస్తుంటేనే అర్థమవుతుంది. ఇదిలా ఉండగా తాజాగా థమన్ ఈసినిమా ట్రైలర్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఇచ్చాడు. ఇప్పడే వీరసింహారెడ్డి థియేట్రికల్ ట్రైలర్ చూసాను, జనవరి 6న ట్రైలర్ కి యూట్యూబ్ లో రచ్చ రచ్చే , జై బాలయ్య అంటూ పోస్ట్ చేశారు. ఇక ఈ పోస్ట్ తో బాలయ్య ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషీ అవుతున్నారు. ట్రైలర్ ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నారు.
Just saw #VeeraSimhaReddy trailer 🔥🔥@YouTube
RACHHHHHHAAAAAA RACHHHHAAAAAAAA6 th JAN fire fire fire 🔥 #JaiBalayya 💥💥
— thaman S (@MusicThaman) January 3, 2023
కాగా ఈసినిమాలో శృతీ హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో బాలయ్యకు విలన్ గా కన్నడ విలక్షణ నటుడు దునియా విజయ్ నటించనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యాన్సర్ పై నవీన్ యెర్నేని, వై రవి శంకర్ కలిసి ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు సినిమాటోగ్రఫి రిషి పంజాబీ అందిస్తున్నాడు. సాయి మాధవ్ బుర్రా మాటలు అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: