టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ లలో దిల్ రాజు ఒకరు. డిస్ట్రిబ్యూటర్ మొదలైన ఆయన ప్రయాణం ఇప్పుడు ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్ వరకూ సాగింది. ఆయన నుండి సినిమా వస్తుందంటే మినిమం గ్యారెంటీ అన్న నమ్మకం ఏర్పరుచుకున్నాడు. ఇన్నేళ్ల తన సినీ ప్రయాణంలో ఎన్నో సూపర్ హిట్లను, బ్లాక్ బస్టర్లను సొంతం చేసుకున్నాడు అలానే ఫ్లాప్స్ ను కూడా చూశాడు. అయినా కూడా నిలదొక్కుకొని ధైర్యంతో సినిమాలు చేసుకుంటూ వెళ్లాడు.. ఆ ధైర్యమే ఇప్పుడు తనను ఈ స్థాయిలో ఉంచింది అంటున్నారు దిల్ రాజు కూడా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం దిల్ రాజు పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. చరణ్ – శంకర్ కాంబినేషన్లో, మరో వైపున విజయ్ – వంశీ పైడిపల్లి కాంబినేషన్లో వందల కోట్ల బడ్జెట్లో సినిమాలు నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న దిల్ రాజు మాట్లాడుతూ .. టాలీవుడ్ నుంచి మాత్రమే పెద్ద సినిమాలు వస్తున్నాయనడం కరెక్టు కాదు. కన్నడ .. తమిళ భాషల్లోనూ పెద్ద సంస్థలు చాలానే ఉన్నాయి. వాళ్లంతా కూడా పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నారు. ఇప్పుడు సినిమా అనేది ఒక భాషకి .. ఒక ప్రాంతానికి పరిమితం కావడం లేదు” అన్నారు. వందల కోట్ల బడ్జెట్ లో నేను సినిమాలు చేయడం రిస్క్ తో కూడుకున్న వ్యవహారమే. అయితే పాన్ ఇండియా సినిమాకి లెక్కలు వేస్తూ కూర్చోవడం కరెక్టు కాదు. రిస్క్ చేయడం వల్లనే నేను ఈ స్థాయికి వచ్చాను. తెలుగు సినిమా ఎదిగింది .. దానితో పాటే నేను కూడా పెరిగాను. అందువల్లనే పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: