అఫీషియల్- గూఢచారి సీక్వెల్ అనౌన్స్ మెంట్

goodachari 2 official announcement,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Goodachari 2,Goodachari 2 Movie,Goodachari 2 Telugu Movie,Goodachari 2 Movie Updates,Goodachari 2 Telugu Movie Updates,Goodachari 2 Update,Goodachari 2 Updates,Goodachari 2 Movie Latest Update,Goodachari 2 Movie News,Goodachari 2 Movie Latest News,Goodachari 2 Telugu Movie Latest News,Goodachari 2 Announcement,Goodachari 2 Announcement Update,Goodachari 2 Announcement News,Goodachari 2 Announcement Video,Goodachari 2 Movie Announcement Video,Adivi Sesh,Adivi Sesh Movies,Adivi Sesh New Movie,Adivi Sesh Latest Movie,Adivi Sesh Upcoming Movie,Adivi Sesh New Movie Update,Adivi Sesh Latest Movie Update,Adivi Sesh Latest Film Updates,Adivi Sesh Latest News,Adivi Sesh Goodachari 2,Adivi Sesh Goodachari 2 Movie,Adivi Sesh Goodachari 2 Announcement,Adivi Sesh Goodachari 2 Announcement Video,Vinay Kumar,Goodachari 2 Movie Launch,Goodachari 2 Movie Launch Update,Goodachari 2 Movie Launch Date,Goodachari 2 Movie Announced

టాలీవుడ్ లో టాలెంటెడ్ నటుల్లో అడివి శేష్ పేరు ముందు వరుసలో ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. వైవిధ్య కథలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు యంగ్ హీరో అడివి శేష్. నటుడిగానే కాదు అటు రచయితగా కూడా తన టాలెంట్ ను చూపిస్తూ దూసుకుపోతున్నాడు. అందుకే వరుసగా హిట్లను అందుకుంటు కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది మేజర్, హిట్ 2 అంటూ రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అడివి శేష్. రెండు సినిమాలు కూడా మంచి విజయాలు అందుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా తన తరువాత అడివి శేష్ ఏ సినిమా చేస్తాడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈనేపథ్యంలోనే తన కొత్త ప్రాజెక్ట్ గురించి గత కొద్దిరోజులుగా హింట్ ఇస్తూ వస్తున్నాడు అడివి శేష్. కొత్త ప్రాజెక్ట్ తో తుఫాన్ రాబోతుంది అంటూ తెలిపాడు. అయితే అది గూఢచారి సీక్వెలా లేక వేరే ఇంకేదైనా ప్రాజెక్టా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో ఇప్పుడు తన కొత్త ప్రాజెక్ట్ కు సంబంధించిన అప్ డేట్ వచ్చేసింది. తన తరువాత ప్రాజెక్ట్ గూఢచారి సీక్వెల్ చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. గూఢచారి సీక్వెల్ ను ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఫోస్టర్‌లో గూడచారి2 లోగోతో పాటు ప్రధాన నటుడు అడివి శేష్ తుపాకీని పట్టుకున్నట్లు చూపించారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను జనవరి 09, 2023న తెలియచేయనున్నట్టు తెలిపారు.

కాగా ఈ సినిమాకు విజయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వం వహిస్తుండగా.. పీపుల్స్ మీడియా, అభిషేక్ అగర్వాల్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్నాయి. అంతేకాదు ఈసినిమాకు అడివి శేష్ కథ, స్క్రీన్ ప్లే అందించనున్నట్టు తెలుస్తుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + 6 =