తలైవా రజినీకాంత్ మాత్రం ఎప్పటినుండో సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ మధ్య కాలంలో రజినీ బ్లాక్ బస్టర్ కొట్టింది లేదు. ఆ మధ్య వచ్చిన అన్నాత్తే మిశ్రమ ఫలితాన్నే అందించింది. ఇక ప్రస్తుతం అయితే తాను జైలర్ అనే సినిమా చేస్తున్నాడు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. రజనీకాంత్ కెరీర్ లో వస్తున్న 169 సినిమా ఇంది. ప్రస్తుతం అయితే ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్సే వచ్చింది. ఇక నేడు తలైవా బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా నుండి మంచి అప్ డేట్ వస్తుందని ఫ్యాన్స్ ఎదురుచూస్తూనే ఉన్నారు. ఈనేపథ్యంలోనే చిత్రయూనిట్ సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చింది. రజనీ క్యారెక్టర్‌ను పరిచయం చేస్తూ ఓ గ్లింప్స్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక తాజాగా ఆ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. గ్లింప్స్ లో పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు తలైవా. ఈ గ్లింప్స్ తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: