జెన్ నెక్ట్స్ మూవీస్ బ్యానర్ పై పలు సూపర్ హిట్ మూవీస్ కు దర్శకత్వశాఖ లో పనిచేసిన గంటా సతీష్ బాబు దర్శకత్వం లో అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో ఆకట్టుకునే కథ కథనాలతో బటర్ ఫ్లై థ్రిల్లర్ మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ మూవీ లో భూమిక చావ్లా, నీహాల్ కీలక పాత్రలు పోషించారు. అర్విజ్ గిడియన్ కట్టా సంగీతం అందించారు. అనుపమ పుట్టిన రోజు సందర్భంగా బటర్ ఫ్లై ఫస్ట్ లుక్ పోస్టర్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ బట్టర్ ఫ్లై కూడా రిలీజ్ కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈనెల 29 నుంచి స్ట్రీమింగ్ కానుంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. విభిన్న కథలతో అలరిస్తున్న అనుపమ ఆడియెన్స్ లో మరింతగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అనుపమ ప్రస్తుతం తమిళంలో సైరెన్, మలయాళంలో జేఎస్కే వంటి సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. అనుపమ కథానాయికగా తెరకెక్కిన 18 పేజెస్ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: