సెలబ్రిటీలపై పెళ్లి వార్తలు రావడం కామనే. ముఖ్యంగా హీరోయిన్స్ పై ఈ వార్తలు ఎక్కువగా వస్తుంటాయి. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ ఈ వార్తలకు బలైపోయారు. పలానా వారిని ప్రేమిస్తున్నారంటూ.. పలానా వారితో పెళ్లి అయిపోయింది అంటూ ఎంతో మంది హీరోయిన్స్ పై వార్తలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇక హీరోయిన్స్ కూడా వాటిపై స్పందిస్తూ కౌంటర్ లు కూడా ఇస్తుంటారు. తాజాగా మరో హీరోయిన్ పై కూడా పెళ్లి వార్తలు ఊపందుకున్నాయి. ఆ హీరోయిన్ ఎవరో కాదు అంజలి. గత కొద్ది రోజులుగా అంజలి పెళ్లిపై పలు వార్తలు వస్తున్నాయి. ఇక ఆ వార్తలపై అంజలి కూడా స్పందించింది. తనకు ఇప్పటికే పెళ్లి అయిపోయిందని, తాను అమెరికాలో నివాసం ఉంటున్నట్టు రకరకాలుగా ప్రచారం జరుగుతోందని… ఆ ప్రచారంలో నిజం లేదని చెప్పింది. ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కూడా తనకు లేదని తెలిపింది. తాను కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని… సమయం వచ్చినప్పుడు తన వివాహం జరుగుతుందని చెప్పింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఫొటో మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన అంజలి తెలుగులో పలు సినిమాల్లో నటించింది. అయితే తెలుగు కంటే కూడా తమిళ్ లో ఎక్కువగా క్రేజ్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో పలు చిత్రాల్లో నటిస్తూ ఆమె బిజీగా ఉంటోంది. వీటితో పాటు ఓటీటీ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. పలు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది. అంతేకాదు అప్పుడప్పుడు స్పెషల్ సాంగ్స్ లలో కూడా చేస్తూ ప్రేక్షకులకు అలరిస్తుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: