హీరో నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నాని సోదరి దీప్తి గంటా దర్శకత్వంలో రూపొందిన ఆంథాలజీ వెబ్ సిరీస్
మీట్ క్యూట్ నవంబర్ 25 వ తేదీన ప్రముఖ ఓటీటీ సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్ లో వర్ష బొల్లమ్మ, సునైనా, ఆదా శర్మ, రుహానీ శర్మ, ఆకాంక్ష సింగ్ , రోహిణి నటించగా సత్యరాజ్ ఒక కీలక పాత్రలో నటించారు. రిలీజ్ అయిన ఈ వెబ్ సిరీస్ టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మీట్ క్యూట్వెబ్ సిరీస్ ప్రీ స్ట్రీమింగ్ సెలెబ్రేషన్స్ హైదరాబాద్ లోని దస్పల్లా హోటల్ లో నిన్న గ్రాండ్ గా జరిగాయి. ఈ సందర్భంగా హీరో నాని మాట్లాడుతూ, ఇటీవల తన సిస్టర్ దీప్తి తనకు ఒక స్టోరీ వినిపించినపుడు ఎంతో బాగా నచ్చిందనీ , అయితే దానితో పాటు మరొక మూడు లేదా నాలుగు స్టోరీస్ రాసుకుంటే మొత్తం కలిపి ఒక ఆంథాలజీగా తీయొచ్చనిఆమె తో చెప్పాననీ , అనంతరం కొన్నాళ్ళకు ఆమె మిగతా స్టోరీస్ రాసిందనీ ,, అయితే తాను మాత్రం అవి వినలేదనీ , అదే సమయంలో అవి విన్న ప్రతి ఒక్కరు బాగున్నాయి అనడంతోఆ స్టోరీస్ చదవడం మొదలెట్టిన తనకు తెలియకుండానే పూర్తిగా స్టోరీస్ లో లీనమయ్యాననీ , వెంటనే వాటిని నిర్మించడానికి సిద్ధం అయ్యాననీ , నిజానికి ఇటువంటివి మల్టిపుల్ డైరెక్టర్స్ తీస్తుంటారని, కానీ అన్నింటి పై దీప్తి ఎంతో పక్కాగా పట్టు కలిగి ఉండడంతో పాటు ఎంతో కేర్ ఫుల్ గా తెరకెక్కించడం తాను చూశాననీ , ఇక ఈ వెబ్ సిరీస్ లో చేసిన ప్రతి ఒక్కరు ఎంతో బాగా యాక్ట్ చేసారనీ , ఇందులోని కాన్సెప్ట్స్, ఫీల్ తప్పకుండా ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందనే నమ్మకం తనకు ఉందనీ , తప్పకుండా నవంబర్ 25న మీ అందరికీ మంచి ఎంటర్టైన్మెంట్ మా ఈ మీట్ క్యూట్ ద్వారా దక్కుతుందనీ చెప్పారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: