విజయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు అక్కినేని వారసుడు నాగచైతన్య. ఈ ఏడాది మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగచైతన్య ఇప్పుడు మరో సినిమాతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం అయితే వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగ చైతన్య ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఇప్పటి వరకూ ఈసినిమా నుండి ఎలాంటి అప్ డేట్ రాలేదు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే నేడు నాగ చైతన్య పుట్టినరోజు కావడంతో ఈసినిమా నుండి ప్రీ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. పోస్టర్ ను బట్టి ఈసినిమాలో నాగచైతన్య పోలీస్ పాత్రలో నటిస్తున్నాడన్న విషయంపై క్లారిటీ వచ్చేసింది. అంతేకాదు ఈసందర్భంగా టైటిల్ ఇంకా ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేస్తున్నట్టు తెలియచేశారు. నవంబర్ 23వ తేదీన టైటిల్, ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.
No 𝐅𝐎𝐑𝐂𝐄 can Hold Down his 𝐑𝐀𝐆𝐄 🌟
Presenting the Fierce Pre Look Poster of #NC22 🔥
Unveiling the first Look & Title tomorrow at 10:18 AM 🥳#NC22Celebrations @chay_akkineni @vp_offl @IamKrithiShetty @thearvindswami @ilaiyaraaja @thisisysr @SS_Screens #Priyamani pic.twitter.com/3fRMrMHBzN
— Srinivasaa Silver Screen (@SS_Screens) November 22, 2022
కాగా బంగార్రాజు సినిమా తరువాత మరోసారి చైతూ తో కృతి శెట్టి కలిసి నటిస్తుంది. ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈసినిమాను తెలుగు, తమిళ్ రెండు భాషల్లో తెరకెక్కించున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: