సన్ పిక్చర్స్ బ్యానర్ పై సూపర్ హిట్ డాక్టర్, బీస్ట్ మూవీస్ ఫేమ్ నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ జైలర్ తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్ 2023 ఏప్రిల్ 14 వ తేదీ రిలీజ్ కానున్నాయని సమాచారం. ఈ మూవీ లో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారు. సీనియర్ హీరోయిన్ తమన్నా ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. హీరో రజనీకాంత్ డ్యూయల్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో నటిస్తున్న ఈ మూవీ ని రెండు భాషల్లో భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Here’s a glimpse of Superstar @rajinikanth from the sets of #Jailer 🤩
@Nelsondilpkumar @anirudhofficial pic.twitter.com/3EtAap0FUs
— Sun Pictures (@sunpictures) November 18, 2022
తాజాగా ఈ సినిమా సెట్స్‌లో రజినీకాంత్ సందడి చేసిన వీడియో గ్లింప్స్ ను నిర్మాణసంస్థ సన్ పిక్చర్స్ సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేసింది. ఈ వీడియోలో రజినీని పూర్తిగా చూపించరు.. నీడలో చూపిస్తారు. వరుసగా సినిమాకు సంబంధించిన మేకింగ్ షాట్లు చూపించారు. అక్కడక్కడ రజినీ షాడో రూపం కనిపిస్తూ ఉంటుంది. చివర్లో రజినీ కూర్చీ మీద కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తున్నట్లున్న షాట్‌తో ఈ మేకింగ్ వీడియో ముగుస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: