టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన సినిమాల హిందీ డబ్బింగ్ వెర్సన్స్ యూట్యూబ్ లో భారీగా వ్యూస్ సాధిస్తున్న విషయం తెలిసిందే.బెల్లంకొండ హీరోగా తెరకెక్కిన అన్ని చిత్రాలు సైతం నార్త్ లో విశేష ప్రేక్షకాదరణ పొందుతుంటాయి. ఈ నేపథ్యంలో బెల్లంకొండ ఇప్పుడు బ్లాక్ బస్టర్ “ఛత్రపతి” హిందీ రీమేక్ ఛత్రపతి మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. ఈ మూవీ తో దర్శకుడు వినాయక్ కూడా బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
పెన్ స్టూడియోస్ , పెన్ మారుధర్ సినీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై వివి వినాయక్ దర్శకత్వంలో బెల్లంకొండ , సుష్రత్ భరూచా జంటగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ ఛత్రపతి హిందీ మూవీ షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంది. ఒరిజినల్ స్టోరీ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఈ మూవీ కి కథ అందించారు. తనీష్ బాగ్చి సంగీతం అందించారు. ఛత్రపతి హిందీ మూవీని డిసెంబర్ రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. సూపర్ హిట్ అర్జున్ సురవరం మూవీ ఫేమ్ టిఎన్ సంతోష్ దర్శకత్వంలో బెల్లకొండ హీరోగా తెరకెక్కనున్న మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. చత్రపతి రీమేక్ సినిమా ఛత్రపతి సక్సెస్ ను బట్టి సంతోష్ దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమా ను హిందీలో డబ్ చేసి భారీ ఎత్తున విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: