తమన్నా మాలీవుడ్ ఎంట్రీ

Tamannaah To Enter Mollywood Soon,Telugu Filmnagar,Telugu Film News 2022,Telugu Filmnagar,Tollywood Latest,Tollywood Movie Updates,Latest Telugu Movies News,Tamanna Bhatia,Actress Tamanna Bhatia,Milky Beauty Tamanna Bhatia,Tamanna,Tamanna Malayalam,Tamanna Entery in Mollywood, Tamanna To Act in Mollywood,Tamannaah Enter Into Mollywood Soon

తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో సుమారు 17 సంవత్సరాలుగా ప్రేక్షకులను అలరిస్తూ తమన్నా స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. అద్భుత డ్యాన్స్ టాలెంట్ ఉన్న తమన్నా పలు భాషల మూవీస్ లో స్పెషల్ సాంగ్స్ లో పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. టాలెంటెడ్ యాక్ట్రెస్ తమన్నా ప్ర‌స్తుతం సత్యదేవ్ “గుర్తుందా శీతాకాలం “, చిరంజీవి “భోళా శంకర్ ” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ “బబ్లీ బౌన్సర్‌‌” హిందీ మూవీ షూటింగ్ ను తమన్నా కంప్లీట్ చేశారు.“బోలె చూడియా”, “ప్లాన్‌ ఎ ప్లాన్ బి”, ఒక హిందీ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. తలైవా రజనీకాంత్ జైలర్ మూవీ లో తమన్నా ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటివరకు దక్షిణాదిన తెలుగు, తమిళ భాషల్లో మాత్రమే నటించిన స్టార్ హీరోయిన్ తమన్నా ఇప్పుడు మలయాళ చిత్ర పరిశ్రమకు ఎంటర్ అవుతున్నారు. దిలీప్‌, సురేష్‌ గోపీ ప్రధాన పాత్రల్లో దర్శకుడు అరుణ్‌ గోపీ ఓ భారీ మలయాళ చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారు.ఇందులో దిలీప్‌కు జోడీగా తమన్నా కథానాయికగా నటించనున్నారు. తమన్నా మాట్లాడుతూ .. చక్కటి అభినయానికి ఆస్కారం ఉన్న పాత్ర ద్వారా మలయాళ చిత్ర పరిశ్రమ లో ఎంట్రీ ఇవ్వడం ఆనందంగా ఉందనీ , .ఇక్కడి ప్రేక్షకుల్ని మెప్పించేందుకు ప్రయత్నిస్తాననీ చెప్పారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.