చాలా కాలం తరువాత ఈఏడాది బంగార్రాజు సినిమాతో మంచి హిట్ ను కొట్టాడు కింగ్ నాగార్జున. ఇక ఇప్పుడు ది ఘోస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కింది. నిజానికి బంగార్రాజు కంటే ముందే ఈసినిమాను ప్రారంభించినా కూడా ఈ సినిమా పూర్తవ్వడానికి లేట్ అవ్వడంవల్ల రిలీజ్ లేట్ అయింది. ప్రసుత్తం అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుంటుంది. మరోవైపు ప్రమోషన్స్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్, టీజర్ మూవీపై అందరిలో బాగా అంచనాలు పెంచేశాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. దీనికోసం డేట్ కూడా ఫిక్స్ చేశారు. ఆగష్ట్ 25న సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. అంతేకాదు ఈ ట్రైలర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా రిలీజ్ చేయనున్నారు.
కాగా ఈసినిమాలో సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటిస్తుంది. యాక్షన్ స్పై థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగార్జున, సోనాల్ చౌహాన్ ఇద్దరూ ఇంటర్‌పోల్ ఆఫీసర్స్‌గా కనిపించనున్నట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమాలో గుల్‌పనాగ్, అనిఖ సురేంద్రన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వెంకటేశ్వర సినిమాస్, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. అక్టోబర్ 5వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: