పలు సూపర్ హిట్ మూవీస్ తో తమిళ ప్రేక్షకులను అలరిస్తున్న స్టార్ హీరో ఆర్య , ఆ మూవీస్ తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్ వరుడు మూవీ తో ఆర్య టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. కన్నడ , మలయాళ భాష మూవీస్ లో కూడా ఆర్య నటించారు. హీరో ఆర్య ఇప్పుడు ఒక యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
థింక్ స్టూడియోస్, ది స్నో పీపుల్ బ్యానర్స్ పై శక్తి సౌందర్ రాజన్ దర్శకత్వంలో ఆర్య , ఐశ్వర్య లక్ష్మి జంటగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ కెప్టెన్ తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్ మూవీ సెప్టెంబర్ 8వ తేదీ రిలీజ్ కానున్నాయి.సిమ్రాన్, హరీష్ ఉత్తమన్, కావ్య శెట్టి, గోకుల్ నాథ్ ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ కి డి ఇమాన్ సంగీతం అందించారు. కెప్టెన్ మూవీ తెలుగు వెర్షన్ ను శ్రేష్ఠ్ మూవీస్ ద్వారా ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ అండ్ హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి విడుదల చేస్తున్నారు.ఈ రోజు ఉదయం యూత్ స్టార్ నితిన్ తెలుగు ట్రైలర్ విడుదల చేశారు.యాక్షన్ ప్యాక్డ్ గా రూపొందిన ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: