50 కోట్ల క్లబ్ లో బింబిసార

Bimbisara Enters 50 Crores Club,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Bimbisara,Bimbisara Movie,Bimbisara Telugu Movie,Bimbisara Movie Collections,Bimbisara Movie Collections Updates,Bimbisara joins into 50 Crores Club,Kalyan Ram Bimbisara Movie Collections Updates,Nandamuri Kalyan Ram,Kalyan Ram Telugu Movie Bimbisara 50 Crores Collections Updates

ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో కళ్యాణ్‌ రామ్‌ హీరోగా బింబిసారుడి జీవితం ఆధారంగా తెరకెక్కిన “బింబిసార ”మూవీ ఆగస్ట్ 5వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ , భారీ కలెక్షన్స్ తో దిగ్విజయం గా ప్రదర్శించబడుతుంది.హీరో కళ్యాణ్ రామ్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన “బింబిసార” మూవీలో క్యాథరిన్, సంయుక్త మీనన్ కథానాయికలు. కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , చిరంత‌న్ భ‌ట్ సంగీతం అందించారు. తన డాషింగ్ లుక్ ముఖ్యంగా బింబిసార గా తన డైలాగ్ డెలివరీ తో కళ్యాణ్ రామ్ ప్రేక్షకులను అలరించారు.భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోన్న “బింబిసార” మూవీ పై సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్న విషయం తెలిసిందే.భారీ కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతున్న “బింబిసార” మూవీ మూడు రోజులలో బ్రేక్ ఈవెన్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“బింబిసార” మూవీ తాజాగా 50 కోట్ల రూపాయల క్లబ్ లోకి చేరింది. కళ్యాణ్‌ రామ్ కెరీర్ లోనే ఓ సినిమా ఇంత త్వరగా 50 కోట్ల క్లబ్ లోకి చేరడం ఇదే తొలిసారి. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ 40 కోట్ల రూపాయల గ్రాస్ సాధించిన “బింబిసార” మూవీ ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల క్లబ్ లో చేరింది. రిలీజైన 10 రోజుల్లోనే “బింబిసార” మూవీ నైజాంలో రెట్టింపు లాభాలతో దూసుకుపోతోంది. అటు సీడెడ్, ఉత్తరాంధ్రలో కూడా దాదాపు రెట్టింపు లాభాలు ఆర్జించి పెట్టింది. ఈ సినిమాతో కల్యాణ్ రామ్ మార్కెట్ అమాంతం పెరిగింది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × four =