తమిళ హీరోలు కూడా ఇప్పుడు తెలుగులో సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే ధనుష్, విజయ్ లాంటి స్టార్ హీరోలు తెలుగులో డైరెక్ట్ గా సినిమాలు చేస్తున్నారు. వీరితో పాటు మరికొంత మంది నటులు కూడా తెలుగు సినిమాలపై ఆసక్తి చూపిస్తున్నారు. తమిళ్ హీరో విష్ణు విశాల్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. ఆరణ్య సినిమాతో మంచి పేరుతెచ్చుకున్న విష్ణు విశాల్ ఇటీవలే తమిళ చిత్రం ఎఫ్.ఐ.ఆర్ లాంటి క్రైమ్ థ్రిల్లర్ తో మంచి హిట్ ను అందుకున్నాడు. ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు సైతం దక్కాయి. ఇక ఇప్పుడు మట్టి కుస్తీ అంటూ వచ్చేస్తున్నాడు. ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ ను స్టార్ట్ చేసింది. ఇప్పటివరకూ దాదాపు 80 శాతం షూటింగ్ ను కూడా పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇక ప్రస్తుతం ఈసినిమా కొత్త షెడ్యూల్ కేరళలో ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. అక్కడ లొకేషన్లలో కొన్ని కీలకమైన సన్నివేశాలతో పాటు లీడ్ పెయిర్స్ లో మధ్య కొన్ని సన్నివేశాలను చిత్రీకరించనున్నారట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈసినిమాలో ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్‌గా నటిస్తుంది. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రిచర్డ్ ఎం.నాథన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈసినిమాను ఈఏడాదే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ మరో వైపు విష్ణు విశాల్ నుండి వచ్చిన ఎఫ్.ఐ.ఆర్ సినిమా తెలుగులో ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై రవితేజ సమర్పణలోనే విడుదలైంది. ఇప్పుడు ఇది రెండో సినిమా. ఈసినిమా వీరిద్దరికి మంచి సక్సెస్ ఇస్తుందేమో చూద్దాం..
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: