సినీ పరిశ్రమ పుట్టి ఎన్నో సంవత్సరాలు అయిపోయింది. దేశవ్యాప్తంగా ఎన్నో భాషలు ఉన్నాయి. ఎన్నో సినీ పరిశ్రమలు ఉన్నాయి. ఏడాదికి ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. అయితే ఎన్ని పరిశ్రమలు ఉన్నా సరే నటీ నటులు మాత్రం అన్ని పరిశ్రమల్లో సినిమాలు చేసుకుంటూ ఉంటారు. ప్రాంతాలకు సరిహద్దులు ఉంటాయేమో కానీ నటీ నటులకు కాదు. ఎవరికి ఎక్కడ అవకాశాలు వస్తే అక్కడ చేసుకుంటూ తన ప్రతిభను చూపించుకుంటారు. ఇక పాత తరం నుండి ఈ తరం వరకూ తోటి నటీనటులతోనే కాదు వేరే భాషల నటీనటులతో స్నేహ పూర్వకంగా ఉండటం మనం చూడొచ్చు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అందులో బాలీవుడ్ నటులు, టాలీవుడ్ నటులు ఎంత సన్నిహితంగా ఉంటారో అందరికీ తెలిసిందే. అనాటి నుంచి నేటి వరకు బాలీవుడ్, టాలీవుడ్ ల మద్య సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం చిరు, సల్మాన్, అమీర్ ఖాన్, నాగార్జున వెంకటేష్ ఇలా సీనియర్ హీరోలే కాదు యంగ్ హీరోలు కూడా చాలా స్నేహంగా కనిపిస్తున్నారు. ఇక బాలీవుడ్ లో హిట్ అయిన చిత్రాలను టాలీవుడ్ లో రిమేక్ చేయడం..టాలీవుడ్ లో హిట్ అయిన సినిమాలు బాలీవుడ్ లో రిమేక్ చేయడం పరిపాటే. మరి ఇప్పుడు ఇలా ఉన్నారంటే దీనికి కారణం ఆనాటి నటీనటులు వేసిన పునాదే కారణమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దానికి ఈకింద ఫొటోనే ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. అలనాటి బాలీవుడ్, టాలీవుడ్ దిగ్గజాలంతా ఒకే చోట కూర్చొని ఉన్న అరుదైన ఫోటో మీకోసం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: