టైసన్ నాయుడు.. షెడ్యూల్ అప్‌డేట్

Bellamkonda Sai Sreenivas Tyson Naidu Schedule Update

ప్రామెసింగ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా రూపొందుతున్న యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ ‘టైసన్ నాయుడు’. ‘భీమ్లానాయక్’ ఫేమ్ సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఈ సబ్జెక్ట్‌పై టీమ్ సూపర్ కాన్ఫిడెంట్‌గా ఉండటంతో రాజీపడకుండా సినిమాను రూపొందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో తాజాగా ‘టైసన్ నాయుడు’ టీమ్ ఒక కీలక అప్‌డేట్ అందించింది. శుక్రవారం నుంచి రాజస్థాన్‌లో ఈ సినిమాకు కీలకమైన 2 వారాల షెడ్యూల్‌ను ప్రారంభించారు. స్టన్ శివ పర్యవేక్షణలో రాజస్థాన్ కోటలలో పది రాత్రులు సినిమాకు సంబంధించిన బ్రెత్ టేకింగ్ యాక్షన్ బ్లాక్‌ను టీమ్ షూట్ చేస్తోంది. ఇది సినిమాలో మెయిన్ హైలైట్‌లలో ఒకటిగా నిలుస్తుందని మేకర్స్ తెలిపారు. ఈ 2 వారాల లెంగ్తీ షెడ్యూల్‌లో మేకర్స్ కొంత టాకీ పార్ట్ కూడా షూట్ చేయనున్నారు.

కాగా హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా జనవరి 3వ తేదీన రివీల్ చేసిన ఈ సినిమా టైటిల్ ‘టైసన్ నాయుడు’ గ్లింప్స్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. గ్లింప్స్‌ను గమనిస్తే, బెల్లంకొండ సినిమాలో మాస్ లుక్‌లో ఉన్నారు. పోలీస్‌గా మునుపెన్నడూ చూడని యాక్షన్ ప్యాక్ క్యారెక్టర్‌లో ప్రెజెంట్ చేస్తున్నారు సాగర్ కె చంద్ర.

ఇక ఈ ‘టైసన్ నాయుడు’ చిత్రానికి టాప్ టెక్నీషియన్లు పని చేస్తున్నారు. ముఖేష్ జ్ఞానేష్/అనిత్ డీవోపీగా వ్యవహరిస్తుండగా.. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రానికి కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌గా, అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్స్‌గా వ్యవహరిస్తున్నారు. స్టన్ శివ, విజయ్, వెంకట్, రియల్ సతీష్ సినిమా యాక్షన్ పార్ట్‌ను పర్యవేక్షిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.