కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్‌కు దేశవ్యాప్తంగానే కాకుండా విదేశాల్లో సైతం మంచి పాపులారిటీ ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆయనకు ఒక అరుదైన గౌరవం దక్కింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) దేశం వివిధ రంగాల్లోని ప్రముఖులకు అందించే గోల్డెన్ వీసా రజినీకాంత్‌కు అందించింది. ఈ మేరకు విషయాన్ని సూపర్ స్టార్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. గోల్డెన్ వీసా పొందడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన రజినీకాంత్ ఇది ఒక గౌరవంగా భావిస్తున్నానని, యూఏఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు అని తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా యూఏఈ ప్రభుత్వం ఈ ప్రత్యేక వీసాల కోసం 2019లో స్పెషల్ డిపార్ట్మెంట్ను ఏర్పాటు చేసింది. ఈ గోల్డెన్ వీసా కాలపరిమితి 10 సంవత్సరాలు. ఆ తర్వాత అవే రెన్యువల్ అయ్యే విధానం అమలులో ఉంది. ఒకసారి ఈ వీసా పొందిన వారు ఎలాంటి ఆంక్షలు లేకుండా యూఏఈలో నివసించవచ్చు, సొంతంగా వ్యాపారాలు నిర్వహించుకోవచ్చు. అలాగే యూఏఈ పౌరులుగా ప్రభుత్వం కల్పించే అన్ని ప్రయోజనాలకు అర్హులుగా ఉంటారు. ఇన్వెస్టర్స్, శాస్త్రవేత్తలు, నటీనటులు, సాహిత్యం, కల్చర్, అసాధారణ ప్రతిభ కలిగిన గ్రాడ్యుయేటర్స్.. ఇలా పలు రంగాలకు చెందిన వారికి ఈ ప్రత్యేక వీసాలను అందిస్తోంది.
యూఏఈ గోల్డెన్ వీసా అందుకున్న భారత ప్రముఖులు వీరే..!
బాలీవుడ్ నుంచి షారుఖ్‌ఖాన్, సంజయ్ దత్, సునీల్ శెట్టి, మౌనీ రాయ్, ఫరా ఖాన్, బోనీ కపూర్ ఫ్యామిలీ, నేహా కక్కర్, సింగర్ సోనూ నిగమ్.. కోలీవుడ్ నుంచి త్రిష, అమలాపాల్.. మాలీవుడ్ నుంచి మోహన్ లాల్, మమ్ముట్టి, టోవినో థామస్, దుల్కర్ సల్మాన్ తదితరులు ఇంతకుముందు ఈ గోల్డెన్ వీసాను అందుకున్నారు. ఇక టాలీవుడ్ నుంచి ఈ వీసా అందుకున్న మొదటి వ్యక్తిగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల నిలిచారు. ఆ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, ఆమె భర్త షోయెబ్ మాలిక్ కూడా యూఏఈ ప్రభుత్వం నుంచి గోల్డెన్ వీసా అందుకున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























