పుష్ప 2.. సెకండ్ సింగిల్ అప్‌డేట్

Pushpa 2 Second Single Update

టాలీవుడ్ లోనే కాకుండా దేశవ్యాప్తంగా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘పుష్ప‌-2: ది రూల్’. ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్‌ నట విశ్వరూపం ప్రదర్శించిన ఈ మూవీ ‘పుష్ప-ది రైజ్‌’కి సీక్వెల్‌గా రూపొందుతోన్న విషయం తెలిసిందే. క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ సినిమా సంచలన విజయం నమోదు చేసింది. దేశంలోని అన్ని ప్రధాన భాషల్లో డబ్ అయి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక ప్ర‌స్తుతం ‘పుష్ప‌ 2: ది రూల్’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్ప‌టికే ఈ మూవీ నుంచి రిలీజైన టీజ‌ర్‌, ఫ‌స్ట్ సింగిల్‌ నెట్టింట రికార్డు వ్యూస్‌ సాధించి సెన్సేషన్ సృష్టించాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో పుష్ప‌ 2 నుంచి అదిరిపోయే అప్‌డేట్ అందించింది చిత్ర బృందం. తాజాగా ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ అప్‌డేట్ ఇచ్చారు మేక‌ర్స్. ఈ సందర్భంగా శ్రీవ‌ల్లి వీడియో ప్రోమోను రేపు ఉద‌యం 11.07 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు సోషల్ మీడియా వేదికగా ప్ర‌క‌టించారు. అయితే ఈ సెకండ్ సింగిల్‌లో హీరోయిన్ రష్మిక మందన్నా కనిపించి సందడి చేయనుంది. కాగా ఈ సెకండ్ సింగిల్ రొమాంటిక్‌ సాంగ్ అని తెలుస్తుంది. ఇక ఫ‌స్ట్ సింగిల్‌తో యూట్యూబ్‌ను షేక్ చేసిన ఈ చిత్రం నుంచి వస్తోన్న రెండో పాట ఈసారి ఎలాంటి రికార్డులు బద్దలు కొడుతుందోనని పుష్పరాజ్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.