శశి కిరణ్ తిక్కా దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా వచ్చిన సినిమా గూఢచారి. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఇక ఇప్పుడు ఈసినిమా సీక్వెల్ వస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే ఈ సీక్వెల్ కు డైరెక్టర్ గా వినయ్ కుమార్ పనిచేయనున్నాడు. ఈనేపథ్యంలో దీనిపై క్లారిటీ ఇచ్చాడు శశి కిరణ్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాజల్ హీరోయిన్ గా సత్యభామ అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇక ఈసినిమా ప్రమోషన్ లో భాగంగా శశికిరణ్ ను గూఢచారి2 డైరెక్టర్ ను ఎందుకు మార్చారు అని అడుగగా… దీనిపై మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు. అడివి శేష్ కు నాకు మధ్య ఎలాంటి ఇష్యూస్ లేవు.. గూఢచారి, మేజర్ సినిమాలకు పనిచేసిన వినయ్ కుమారే ఈసినిమాకు దర్శకత్వంలో వహిస్తున్నాడు. గూఢచారి వరల్డ్ గురించి వినయ్ కు అంతా తెలుసు.. నేను అర్థరాత్రి ఫోన్ చేసి అడిగినా గూఢచారి గురించి ప్రతి డిటెయిన్ చెప్పేవాడు.. అంతా క్లారిటీ ఉంది తనకు.. తనే ఈసినిమాకు పర్ఫెక్ట్ ఛాయిస్. అంతేకాదు నాక్కూడా పలు కమిట్ మెంట్స్ ఉన్నాయి.. వేరే సినిమా డైరెక్ట్ చేయాల్సి ఉంది.. సత్యభామ ప్రొడ్యూసింగ్ పనులు ఉండటంతో ఆ రెస్పాన్సిబిలిటీని వినయ్ కు ఇచ్చాం అని తెలిపాడు.
కాగా ఈసినిమాలో బనితా సందు హీరోయిన్ గా నటిస్తుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ లపై ప్రముఖ నిర్మాతలు టిజి విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: