అమరన్ షూటింగ్ కంప్లీట్ 

Amaran shoot wrapped

తమిళ హీరో శివ కార్తికేయన్ అమరన్ షూటింగ్ నేటితో కంప్లీట్ అయ్యింది.ఇందులో శివ కార్తికేయన్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనున్నాడు.రాజ్ కుమార్ పెరియస్వామి ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా వస్తుంది.సాయి పల్లవి హీరోయిన్ గా నటించగా జివి ప్రకాష్ కుమార్   సంగీతం అందిస్తున్నాడు.కమల్ హాసన్ సొంతం బ్యానర్ రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ ఈసినిమాను నిర్మిస్తుంది.సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో విడుదలచేసేలా ప్లాన్ చేస్తున్నారు.త్వరలోనే రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక శివ కార్తికేయన్ ప్రస్తుతం మురగదాస్ డైరెక్షన్ లో కూడా ఓ సినిమా చేస్తున్నాడు.ఇందులో కాంతారా ఫేమ్ రుక్మిణి వసంత్  హీరోయిన్ గా నటిస్తుండగా అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.వచ్చే ఏడాది ఈసినిమా థియేటర్లలోకి రానుంది.

ఇదిలాఉంటే ఈఏడాది ప్రారంభంలో అయలాన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన  ఈసినిమాతో శివ కార్తికేయన్ డీసెంట్ హిట్ అందుకున్నాడు.అయితే ఈసినిమా తెలుగులో కూడా విడుదలకావాల్సి ఉండగా ఆర్ధిక సమస్యల వల్ల ఆగిపోయింది.ఓటిటి లో కూడా ప్రస్తుతం తమిళ వెర్షన్ ఒక్కటే స్ట్రీమింగ్ అవుతుంది.తెలుగు వెర్షన్ ఎప్పుడొస్తుందో క్లారిటీ లేదు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.