మోహన్‌ లాల్ బర్త్ డే.. ఎంపురాన్ నుండి ఫస్ట్‌ లుక్‌ రివీల్

Mohanlal First Look Out From Empuraan

మలయాళం సూపర్ స్టార్ మోహన్‌లాల్‌కు టాలీవుడ్ లోనూ మంచి పాపులారిటీ ఉంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ సినిమాలో మోహన్ లాల్ నటించిన విషయం తెలుగు ప్రేక్షకులకు తెలిసిందే. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా నాలుగు సార్లు జాతీయ అవార్డు గెలుచుకున్న అద్భుత నటుడు. మంగళవారం ఆయన జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం మోహన్ లాల్ వరుస చిత్రాల్లో నటిస్తున్నారు. మాతృభాష మలయాళం సహా తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో కూడా ఆయన సినిమాలను చేస్తున్నారు. వీటిలో మోస్ట్ క్రేజీఎస్ట్ ప్రాజెక్టుగా ‘ఎంపురాన్’ తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి స్టార్ హీరో, ‘సలార్’ ఫేమ్ పృథ్విరాజ్‌ సుకుమారన్‌ దర్శకత్వం వహిస్తుండటం విశేషం. కాగా ఇందులో మోహన్‌ లాల్, పృథ్విరాజ్‌ సుకుమారన్‌, మంజు వారియర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి మోహన్ లాల్ ఫస్ట్‌ లుక్‌ను రివీల్ చేశారు మేకర్స్‌.

ఈ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్ గమనిస్తే.. మోహన్‌లాల్‌ గన్‌మెన్స్‌ మధ్యలో నుంచి బ్లాక్ గాగుల్స్‌ పెట్టుకుని గంభీరంగా నడుచుకుంటూ వస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ లుక్‌ నెట్టింట ట్రెండింగ్‌ అవుతోంది. కాగా ‘ఎంపురాన్’ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా విడుదల కానుంది. మరోవైపు మోహన్ లాల్ తెలుగు, మలయాళ బైలింగ్యువల్‌ ప్రాజెక్ట్‌ ‘వృషభ’లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో టాలీవుడ్ యువ నటుడు రోషన్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అలాగే పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన మలైకోటై వాలిబన్ సీక్వెల్‌లో కూడా నటిస్తున్నారు. వీటితోపాటు ‘రామ్: పార్ట్ 1’, ‘రామ్: పార్ట్ 2’ సినిమాలలో నటిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.