ఒకే ఒక జీవితంతో హిట్ కొట్టి ట్రాక్ లోకి వచ్చిన యంగ్ హీరో శర్వానంద్ మనమే తో పలకరించనున్నాడు.ఈరోజు ఈసినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించారు.వచ్చే నెల 7న మనమే థియేటర్లోకి రానుంది.ఇక అదే రోజు కాజల్ నటించిన సత్యభామ కూడా విడుదలకానుంది.దాంతో బాక్సాఫీస్ వద్ద పోటీ నెలకొననుంది. మనమేను శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కిస్తుండగా కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది.ఇందులో శ్రీరత్ కపూర్ కీలక పాత్రలో కనిపించనుండగా హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్నాడు.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది.రీసెంట్ గా టీజర్ ను రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
#Manamey will be yours from 𝐉𝐔𝐍𝐄 𝟕𝐭𝐡 📣✨
The 𝐁𝐈𝐆𝐆𝐄𝐒𝐓 𝐄𝐍𝐓𝐄𝐑𝐓𝐀𝐈𝐍𝐄𝐑 of the Season is all set to paint your hearts & screens ❤️🔥
In Cinemas #ManameyOnJune7th 🥳 @ImSharwanand @IamKrithiShetty @SriramAdittya @vishwaprasadtg @IamSeeratKapoor #AyeshaKhan… pic.twitter.com/lkhi5KARf6
— People Media Factory (@peoplemediafcy) May 24, 2024
ఇక ప్రస్తుతం శర్వానంద్ మరో రెండు సినిమాలు కూడా చేస్తున్నాడు.అందులో భాగంగా అభిలాష్ రెడ్డి కంకర డైరెక్షన్ లో తన 36వ సినిమాలో నటిస్తున్నాడు.అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ లో వస్తుంది.మాళవిక నాయర్ ఇందులో హీరోయిన్ గా నటిస్తుండగా గిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు.యూవీ క్రీయేషన్స్ నిర్మిస్తుంది.
అలాగే సామజవరగమన ఫేమ్ రామ్ అబ్బరాజు తో శర్వా 37వ సినిమాను చేస్తున్నాడు.అనిల్ సుంకర ఈసినిమాను నిర్మిస్తుండగా విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు.ఈఏడాది సెకండ్ హాఫ్ లో విడుదలకానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























