కల్కి 2898 AD.. బుజ్జి x భైరవ టీజర్‌ హైలైట్స్ ఇవే..!

Kalki 2898 AD Bujji and Bhairava Teaser Release Event Highlights

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ప్రతిష్టాత్మక గ్లోబల్ ప్రాజెక్ట్ ‘కల్కి 2898 AD’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి స్టార్ నటులు నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో దీపికా పదుకొణే ఫిమేల్ లీడ్ రోల్ పోషిస్తుండగా.. మరొక హీరోయిన్ బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ కీలక పాత్రలో కనిపించనుంది. వైజయంతి మూవీస్‌ పతాకంపై టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అశ్వనీ దత్‌ దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ చేసిన గ్లింప్స్, స్పెషల్ వీడియోస్ అన్నీ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. జూన్ 27వ తేదీన ‘కల్కి 2898 AD’ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నిర్మాతలు కస్టమ్-మేడ్ వాహనాన్ని విడుదల చేయడానికి హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీలో ఒక వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సినిమాలో కీలక పాత్ర పోషించిన ‘బుజ్జి’ని ప్రపంచానికి పరిచయం చేయడానికి దాదాపు 1 నిమిషం నిడివి గల టీజర్‌ను కూడా విడుదల చేశారు.

కల్కి 2898 AD.. బుజ్జి x భైరవ టీజర్‌ హైలైట్స్..

  • కల్కి 2898 AD నాటి కల్కి ప్రపంచంలోని సొగసైన వెహికల్ రోబోను రివీల్ చేయడానికి మేకర్స్ బుజ్జి x భైరవ టీజర్‌ను విడుదల చేశారు.
  • రెగ్యులర్ ఫిల్మ్ ఈవెంట్‌ ల మాదిరిగా కాకుండా, ఈ ఈవెంట్‌లో బైకర్లు కొన్ని అద్భుతమైన విన్యాసాలు చేశారు.
  • అమెరికాస్ గాట్ టాలెంట్ సీజన్ 2ను గెలుచుకున్న ముంబైకి చెందిన వి.అన్‌బీటబుల్ జట్టు వేదికపై ప్రభాస్ మెడ్లీపై ప్రదర్శన ఇచ్చింది.
  • ఇక జాతీయ మీడియా, అభిమానులు మరియు ప్రేక్షకుల మధ్య వినూత్నంగా ప్లాన్ చేసిన ప్రోగ్రామ్‌ లు మరియు స్వాంకీ బుజ్జితో ఇది చాలా విజయవంతమైన ఈవెంట్ గా నిలిచింది.
  • బుజ్జి భైరవ యొక్క నమ్మకమైన భాగస్వామిగా ఉంటూ మరియు సినిమా కథాంశంలో కీలక పాత్ర పోషిస్తుంది.
  • బుజ్జి హాస్యాస్పదమైనప్పటికీ మేధావి. తన లక్ష్యాన్ని సాధించడంలో భైరవకు సహాయం చేస్తుంది.
  • “వెనక్కి వెళ్ళే ప్రసక్తే లేదు,” అని భైరవ చెప్పడం తన మిషన్‌ లో విజయం సాదించేందుకు తన పట్టుదలని తెలియజేస్తుంది.
  • ఇక ఈ టీజర్‌ ను గమనిస్తే.. ప్రపంచ స్థాయి విజువల్స్ కొన్ని మైండ్ బ్లోయింగ్ గా ఉన్నాయి.
  • సాంకేతిక అంశాలతో పాటు ప్రొడక్షన్ డిజైన్ కూడా అద్భుతంగా ఉంది.
  • దాదాపు ఒక నిమిషం నిడివిగల వీడియో ఈ అద్భుతమైన వాహనాన్ని రూపొందించడంలో ఉన్న గొప్పతనాన్ని చూపుతుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.