మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా గాడ్ ఫాదర్. మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ సినిమాకు ఈసినిమా రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా ఎప్పటినుండో షూటింగ్ ను జరుపుకుంటుండగా దాదాపు చివరి దశకు వచ్చేసింది. రీసెంట్ గానే ఈసినిమా నుండి చిరు ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. గంభీరంగా ఉన్న చిరు లుక్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ప్రస్తుతం ఈసినిమా క్లైమాక్స్ షూటింగ్ ను జరుపుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా క్లైమాక్స్ కోసం హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు ఈ క్లైమాక్స్ షూటింగ్ లో చిరుతో పాటు సల్మాన్ ఖాన్ కూడా పాల్గొననున్నట్టు తెలుస్తుంది. ఈసినిమాలో సల్మాన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కేవలం నటించడమే కాదు.. ఇద్దరూ కలిసి ఒక పాటలో అలానే యాక్షన్ సన్నివేశాల్లో కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటుండటంతో అటు చిరు అభిమానులు, సల్మాన్ అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కాగా ఈసినిమాలో నయనతార, టాలెంటెడ్ నటుడు సత్యదేవ్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రామ్ చరణ్ సమర్పణలో ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్‌గుడ్ ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఎస్ఎస్. థమన్ మ్యూజిక్ అందిస్తుండగా.. నీరవ్ షా డివోపీ హ్యాండిల్ చేస్తున్నారు.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: