సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , నిత్యామీనన్ , రానా దగ్గుబాటి, సంయుక్త మీనన్ జంటలుగా సూపర్ హిట్ ”అయ్యప్పనుమ్ కోషియమ్ ”మలయాళ మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కిన “భీమ్లా నాయక్ ” మూవీ ఫిబ్రవరి 25 వ తేదీ తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్ లో భారీ ఎత్తున రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్, భారీ కలెక్షన్స్ తో ఘనవిజయం సాధించింది. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ , స్క్రీన్ ప్లే అందించిన “భీమ్లా నాయక్ ” మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందించారు. పవర్ ఫుల్ డైలాగ్స్ , అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో పవన్ కళ్యాణ్ ప్రేక్షకులను అలరించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“భీమ్లా నాయక్” మూవీ ని హిందీలో కూడా విడుదల చేయాలని చిత్ర నిర్మాణ సంస్థ ప్లాన్ చేసింది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు. కానీ, హిందీ వెర్షన్ తెలుగుతోపాటు విడుదల కాలేదు. ఈ చిత్రం హిందీ రిమేక్, డబ్బింగ్ హక్కులు పొందిన హిందీ నిర్మాణ సంస్థ కోర్టులో వ్యాజ్యం దాఖలు చేయడంతో “భీమ్లా నాయక్” హిందీ డబ్బింగ్ వెర్షన్ విడుదలను తాత్కాలికంగా నిలిపేశారు. దీనిపై కోర్టు స్పందిస్తూ.. కాపీరైట్స్‌ను కొనుగోలు చేసిన యజమానికి హిందీతో సహా ఏ భాషలోనైనా తెలుగు సినిమాని డబ్ చేసే హక్కు ఉంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్ణయాన్ని అడ్డుకొనేందుకు హిందీ నిర్మాణ సంస్థ ఏ హక్కును పొందలేరు’’ అని తెలిపింది. తెలుగులో మార్పుచేర్పులతో విడుదల చేసుకోడానికి సితార ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థ పూర్తి హక్కులను సొంతం చేసుకోవడం వల్ల హిందీలో కూడా డబ్బింగ్ చేసుకుని విడుదల చేసుకునే రైట్‌ను సొంతం చేసుకుందని కోర్టు పేర్కొంది. దీంతో “భీమ్లా నాయక్” హిందీ వెర్షన్‌కు లైన్ క్లియర్ అయినట్లే.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: